కడప జిల్లాలో చూడవలసిన జలపాతాలు ( పార్ట్ – 1 )

కడప జిల్లాలో చూడవలసిన జలపాతాల గురించి మీరు వెతుకుతుంటే మీరు సరైన ప్రదేశానికే వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఈ ఆర్టికల్లో కడప జిల్లాలో వున్న అందమైన మరియు అధ్బుతమైన జలపాతాల గురించి చెప్పబోతున్నాను. కడప జిల్లాలో చాలా జలపాతాలు వున్నాయి వాటన్నింటి గురించి ఒకే సారి చెప్పడం కష్టం. అందువల్ల వాటిగురించి ఒక సిరీస్లో మీకు తెలియజేస్తాను. ఆ సిరీస్లో భాగంగా ముందుగా మొదటి ఐదు జలపాతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కడప జిల్లాలో వున్న అందమైన జలపాతాలు :

1.   మల్లెంగుండం జలపాతం
2.  నిత్య పూజ కోన జలపాతం
3.  అగస్తేశ్వర స్వామి కోన జలపాతం
4.  గుర్రప్ప స్వామి కోన జలపాతం
5.  రంగనాయకుల స్వామి కోన జలపాతం

1. మల్లెంగుండం జలపాతం :

మల్లెంగుండం జలపాతం కడప జిల్లా లోని దువ్వూరు మండలంలో ఉంది. ప్రకృతి అందాల మధ్య ఈ జలపాతం ఎంతో ఎత్తు వుండికింద ఈదడం కొరకు విశాల ప్రదేశంతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. జలపాతంనకు కుడివైపున శ్రీ మల్లెం గుండెశ్వర స్వామి వారు నెలకొని వున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం మరియు ప్రతి సోమవారం నాడు ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఈ ప్రదేశం దట్టమైన అడవిలో వుండడం వలన ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరిస్తూ వుంటాయికావున విశేష రోజులలో తప్ప మిగిలిన రోజులలో ఇక్కడికి ఎవరు రారు.

ఎలా చేరుకోవాలి ?

ఈ ప్రదేశం దువ్వూరు నుండి 15 km దూరంలో కలదు. ముందుగా మీరు దువ్వూరు చేరుకొని అక్కడి నుండి నీలాపురం వెళ్ళాలిఅక్కడి నుండి మట్టి రోడ్డు ద్వారా “ పేదపాయ తాండా ”కి వెళ్ళవలసి ఉంటుంది. మీరు పెదపాయ తండాకు వెళ్లిన తరువాత ఎడమ వైపు వెళ్తే “ కోన వల్లభ రాయుడు స్వామి ఆలయం ” వస్తుందిఈ ఆలయం ఒక కొండ గుహలో కలదు. తండాకు కుడి వైపు వెళ్తే మల్లెం గుండం జలపాతానికి వెళ్ళే మార్గం వస్తుందిఅక్కడి నుండి దాదాపు 2 km వెళ్తే జలపాతం వున్న అటవీ ప్రాంతంనకు వెళ్తాము. దాదాపు రెండు కొండలను ఎక్కి దిగవలసి వుంటుందికాబట్టి మీతో పాటు నీళ్లను కూడా తీసుకువెళ్ళిండి. కారు ద్వారా ఐతేకేవలం తాండా వరకు మాత్రమే వెళ్ళగలరు. బైక్ ద్వారా ఐతేజలపాతానికి వెళ్ళే కొండ మార్గం వరకు వెళ్ళవచ్చుఅక్కడి నుండి నడుచుకుంటు కొండ ఎక్కవలసి వుంటుంది. దారి వెంబడి గుర్తులను ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు.
గమనిక : మీకు మేము చెప్పిన మార్గం అర్థం కాకపోతే అక్కడి సమీపంలో వున్న గ్రామ ప్రజల సహాయాన్ని పొందండి.

2. నిత్య పూజ కోన జలపాతం :

నిత్య పూజ కోన జలపాతం కడప జిల్లా లోని సిద్ధవటం మండలంలో వుంది. సిద్ధవటం నుండి దాదాపు 10 km దూరంలో లంకమల్ల అడవుల్లో ఈ నిత్య పూజ కోన వుంది. చుట్టూ ఎత్తైన చెట్లతో ఈ ప్రదేశం పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది. జలపాతానికి 4 km ముందే వున్న పంచలింగాల వద్ద మన వాహనాలను పార్క్ చేయవలసి వుంటుందిఅక్కడి నుండి ఈ దట్టమైన అడవిలో పక్షులు శబ్దాల మధ్య నడుచుకుంటూ ఈ జలపాతాన్ని చేరుకోవాలి. జలపాతం నుండి కొండ మీదకు మెట్లు వున్నాయిపైన గుహలో శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమైవుంటారు. అక్కడ ప్రతి సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. మహా శివరాత్రి సంధర్భంగా అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తారు.

ఎలా చేరుకోవాలి ?

నిత్య పూజ కోనకు ఎటువంటి బస్సు సౌకర్యం లేదు. కడప నుండి సిద్దవటం వరకు బస్సు సౌకర్యం వుంది. ఇక సిద్దవటం నుండి ప్రైవేట్ ఆటోలు అందుబాటులో వుంటాయి. అయితే మీ సొంత వాహనాలలో ఇక్కడకు రావడం చాలా మంచిది.

3. అగస్తేశ్వర స్వామి కోన జలపాతం :

అగస్తేశ్వర స్వామి కోన జలపాతం మైలవరం గ్రామానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వెలసిన ఈశ్వరునికి అగస్త్య మహాముని పూజలు చేసేవారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం “ మహా శివరాత్రి ” పర్వదినం సందర్భంగా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మహా శివరాత్రి నాడు ఇక్కడకు భక్తులు అసంఖ్యంగా విచ్చేసి అగస్తేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడి ఆలయానికి పక్కన ఒక అందమైన జలపాతం మనకు దర్శనమిస్తుంది. ఈ జలపాతం ముందు భాగంలో ఒక కొనేరులాగా నిర్మించారుఅందులో చాలా చిన్న చిన్న చేపలు వున్నాయి. వర్షాకాలంలో మాత్రమే ఈ జలపాతం మనకు దర్శనమిస్తుంది.

ఎలా చేరుకోవాలి ?

ఈ అగస్తేశ్వర స్వామి కోన జమ్మలమడుగు నుండి 18 కిలో మీటర్లుమైలవరం నుండి 10 కిలో మీటర్లుగుర్రప్ప కోన నుండి 2 కిలో మీటర్ల దూరంలో వుంది. ఇక్కడికి చేరకోవాలంటే మీ సొంత వాహనాలలో మాత్రమే రావలసివుంటుందిఅయితే మహా శివరాత్రి నాడు మాత్రమే ఇక్కడికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించబడుతుంది.

4. గుర్రప్ప స్వామి కోన జలపాతం :

గుర్రప్ప స్వామి కోన జలపాతం జమ్మలమడుగు నుండి 16 కిలో మీటర్లు మరియు మైలవరం నుండి 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ గుర్రప్ప స్వామి కోనలో శ్రీ గుర్రప్ప స్వామి వారు నెలకొని వున్నారు. ఈ స్వామి వారిని దర్శించుకొనుటకు కర్ణాటకఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ప్రతి సోమవారం ఇక్కడ స్వామి వారిని దర్శించుకొనుటకు చాలా మంది భక్తులు వస్తుంటారు. గుడికి వెనుక భాగాన మనకు తురుకల చెరువు దర్శనమిస్తుంది. గంగమ్మ తల్లి ఆలయంనవగ్రహముల నక్షత్ర వనముఫక్షన్ హలుఅన్నదాన సత్రం మొదలగునవి ఇక్కడ వున్నాయి. ఇక్కడ పిల్లల వినోదం కోసం చిన్న పార్కు కూడా వుందిఇక్కడ జలపాతాల అందాలు చూడాలంటే నవంబర్ మరియు డిసెంబర్ మాసాలలో ఇక్కడికి రావలసి ఉంటుంది. గుడికి ఎడమ భాగాన ఈ జలపాతం మనకు కనిపిస్తుంది. గుడికి వెనుక భాగాన వున్న తురకుల చెరువు నిండినప్పుడు మాత్రమే ఈ జలపాతం మనకు దర్శనమిస్తుంది. ఈ గుర్రప్ప స్వామి కోన నుండే అగస్తేశ్వర స్వామి కోనకు వెళ్ళే మార్గం వుంటుంది.

ఎలా చేరుకోవాలి ?

ఈ ప్రదేశాన్ని చేరుకోవాలంటే జమ్మలమడుగు మరియు మైలవరం నుండి ప్రైవేట్ ఆటోలు అందుబాటులో వుంటాయిమరియు కొన్ని నిర్ణీత సమయాల్లో మాత్రమే ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంటుంది.

5. రంగనాయకుల స్వామి కోన జలపాతం :

రంగనాయకుల స్వామి కోన జలపాతం కడప జిల్లా లోని తలమంచిపట్నంలో కలదు. ఈ జలపాతం తలమంచిపట్నం నుండి 4 km దూరంలో కలదు మరియు జమ్మలమడుగు నుండి దాదాపు 20 km దూరంలో వుంది. ఈ ప్రదేశం ముఖ్యంగా శ్రీ రంగనాయకుల స్వామి ఆలయానికి ప్రసిద్ధి. ఇక్కడ వున్న గుహలో మనం రంగనాయకుల స్వామి విగ్రహాన్ని చూడవచ్చుఇది దాదాపు 500 ఏళ్లనాటిదని అక్కడి ప్రజలు చెప్తూ వుంటారు. రంగనాయకుల స్వామి విగ్రహం పక్కనే మనం శ్రీ గోవిందరాజస్వామిని కూడా చూడవచ్చుఅంతే కాకుండా ఆ గుహలోనే ఆళ్వార్ల విగ్రహాలను కూడా సందర్శించవచ్చు. వర్షాకాలంలో ఐతే ఇక్కడ మనం అందమైన జలపాతాన్ని చూడవచ్చుఈ జలపాతాన్ని చూడడానికి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారుఇక్కడి దగ్గర లోని చెక్ డామ్ నిండి అందులోని నీళ్ళు మనకు అందమైన జలపాతాన్ని ఇస్తున్నాయి.

ఎలా చేరుకోవాలి ?

ముందుగా మీరు జమ్మలమడుగు చేరుకోవాలి అక్కడి నుండి తోర్రివేముల మీదుగా గంగునారాయనపల్లి వెళ్ళే మార్గంలో గండికోట కాలువ పక్కన వున్న మట్టి రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. లేదా తలమంచిపట్నం నుండి 4 km వెళ్తే ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు.
గమనిక : కడప జిల్లా లోని మిగిలిన జలపాతాల గురించి మన తరువాతి ఆర్టికల్లో తెలుసుకుందాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు