కడప జిల్లాలో చూడవలసిన జలపాతాలు ( పార్ట్ – 2 )

కడప జిల్లాలో చూడవలసిన జలపాతాల గురించి మీరు వెతుకుతుంటే మీరు సరైన ప్రదేశానికే వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఈ ఆర్టికల్లో కడప జిల్లాలో వున్న అందమైన మరియు అధ్బుతమైన జలపాతాల గురించి చెప్పబోతున్నాను. కడప జిల్లాలో చాలా జలపాతాలు వున్నాయి వాటన్నింటి గురించి ఒకే సారి చెప్పడం కష్టంఅందువల్ల వాటిగురించి ఒక సిరీస్లో మీకు తెలియజేస్తాను. ఆ సిరీస్లో భాగంగా ముందుగా మొదటి ఐదు జలపాతాల గురించి పార్ట్ – 1 లో చెప్పాను. ఇప్పుడు తరువాతి 5 జలపాతాల గురించి తెలుసుకుందాం.

కడప జిల్లాలో వున్న అందమైన జలపాతాలు :

6. గండికోట జలపాతం
7. హంసల కోన జలపాతం ( భజరంగి కోన జలపాతం )
8. పాలకొండలు జలపాతం
9. ఆదినిమ్మాయపల్లి జలపాతం
10. పెద్దచెలిమి జలపాతం

6. గండికోట జలపాతం :

గండికోట జలపాతం కడప జిల్లాలోని జమ్మలమడుగులో వున్న గండికోట నుండి 2 km దూరంలో వుంటుంది. చాలా మంది పర్యాటకులు గండికోటను చూడటానికి వస్తుంటారుకానీ ఇక్కడకు వెళ్ళరు ఎందుకంటే ఈ ప్రదేశం చాలా మందికి తెలియదు. ఈ జలపాతం గండికోటకు వెళ్లే మార్గంలో వున్న హరిత రిసార్ట్ కు సమీపంలో వుంటుందిఅక్కడ “ నరసింహ స్వామి పాద క్షేత్రమునకు ” దారి అని ఒక బోర్డు వుంటుందిఆ మార్గంలో దాదాపు 1 km వరకు నడుచుకుంటూ వెళ్తే మీరు ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. దారి పొడవునా ఒక తెల్లటి గీత వుంటుందిఆ గీతను అనుసరించి వెళ్తే మనం ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు.

ఎలా చేరుకోవాలి ?

గండికోట జమ్మలమడుగు నుండి 16 kmల దూరంలో వుందిగండికోటకు చేరుకోవడానికి జమ్మలమడుగు నుండి బస్ సౌకర్యం కూడా ఉంది. అయితే మీరు జలపాతంనకు వెళ్లాలంటే హరిత రిసార్ట్ వద్ద దిగి నడుచుకుంటూ వెళ్ళాలి.

7. హంసల కోన జలపాతం ( భజరంగి కోన జలపాతం ) :

హంసల కోన జలపాతం కడప జిల్లాలోని జమ్మలమడుగులో వుంది. దీనిని “ భజరంగి కోన ” అని కూడా పిలుస్తారు. జమ్మలమడుగు నుండి ముద్దునూరుకు వెళ్ళే మార్గంలో చిటిమిటిచింతల అనే ఒక టోల్ గేట్ వస్తుందిదానికి సమీపంలోనే ఎడమ వైపున “ భజరంగి కోన ” అని ఒక బోర్డు వుంటుంది. అక్కడి నుండి దాదాపు 1 km నడుచుకుంటూ వెళ్తే ఈ హంసల కోన జలపాతానికి చేరుకుంటారు. ఈ జలపాతానికి చేరుకునే మార్గం వెంబడి దాదాపు 500 m వరకు చిన్న చిన్న జలపాతాలు మనకు దర్శనమిస్తాయి. మరియు ఇక్కడ “ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ” కూడా వుంది.

ఎలా చేరుకోవాలి ?

హంసల కోన జలపాతం జమ్మలమడుగు నుండి 11 km మరియు ముద్దునురు నుండి 10 km దూరంలో వుంది. ఇక్కడకు నేరుగా బస్సు సౌకర్యం లేదు కానీ ఇక్కడికి సమీపంలో వున్న చిటిమిటిచింతల అనే గ్రామం వరకు బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుండి నడుచుకుంటూ ఈ జలపాతం వద్దకు చేరుకోవచ్చు.

8. పాలకొండలు జలపాతం :

వర్షాకాలం వస్తే చాలు మన కడప జిల్లాలోని పాలకొండలలో ఒక అద్భుతమైన జలపాతం మనకు దర్శనమిస్తుంది. ఈ జలపాతం కడప “ నగరవనం ”  పార్కుకు సమీపంలో ఉందిఈ జలపాతానికి కుడి వైపు ఉన్న కొండమర్గం “ శ్రీ పాలకొండ్రాయ స్వామి ” ఆలయానికి వెళ్తుంది. కొండ పైన వున్న ఆలయానికి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయిచుట్టూ పచ్చని చెట్లుజలపాతం యొక్క శబ్దాలు పర్యాటకులను కట్టిపడేస్తాయిఆలయ సమీపంలో ప్రవహించే పిల్ల కాలువ ప్రవహిస్తూ కిందకి వెళ్తూ ఇక్కడ వున్న ఈ జలపాతాన్ని ఏర్పరిచింది. ఈ జలపాతాన్ని సందర్శించడానికి చాలా మంది ఆదివారం నాడు వస్తూ ఉంటారుమరియు కొండ పైన వున్న “ శ్రీ పాలకొండ్రాయ స్వామి ” ఆలయంనకు ప్రతి శనివారం నాడు భక్తులు వస్తూ వుంటారుఆ రోజు అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. జలపాతంనకు చేరుకోవడానికి బయటి నుండి దాదాపు 500 m కొండ మార్గంలో నడవ వలసి వుంటుందిఈ మార్గం ఎత్తైన రాళ్ళు మరియు అక్కడక్కడ జలపాతం యొక్క నీరు ప్రవహిస్తూ వుంటుందిమీరు వాటిలో కుడా నడవ వలసి వుంటుంది. జలపాతానికి వెళ్ళే మార్గం బయట కొన్ని తినుబండారాలు కూడా లభిస్తాయి ( ఐస్ క్రీమ్షర్బత్బిస్కెట్స్ మొదలైనవి ). ఇక్కడే ఒక పెద్ద బావి కూడా వుంటుందిఅక్కడి నుండి కొండ మార్గంలో మనం వెళ్తే జలపాతానికి చేరుకుంటాము. లోపల జలపాతం కింద కొద్దిగా ఖాళీ ప్రదేశం వుంటుంది దానిలో జలపాతం నీరు పడుతూ ఉంటుంది అందువలన అక్కడ పిల్లలు లేదా పెద్దలు ఆడుకోవడానికి బాగుంటుంది. కొండ పైకి ఎక్కడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు అసలు పైన ఏముంది అని అక్కడి వారిని అడిగి తెలుసుకున్నాంఅది ఏమిటంటే పైన ఒక లోయ లాగా వుంటుందట అది మొత్తం నీటితో మునిగిపోయి వుంటుందిఅది చాలా ప్రమాదకరం అని అక్కడి వారు చెప్పారుకాబట్టి మేము అక్కడికి వెళ్ళలేదు.

ఎలా చేరుకోవాలి ?

ఈ ప్రదేశం కడప శిల్పారామం నుండి 2 km దూరంలో వుంది. కడప నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం లేదుకేవలం ప్రైవేటు వాహనాల ( ఆటోలు ) ద్వారా మాత్రమే ఇక్కడికి చేరుకోగలము.

9. ఆదినిమ్మాయపల్లి జలపాతం :

ఆదినిమ్మాయపల్లి జలపాతం కడప జిల్లాలోని కమలాపురం మరియు ఖాజీపేటకు సమీపంలో వుంది. సుమారు 150 సంవత్సరాల క్రితం కొట్లూరుకొమ్మలూరు గ్రామాల సమీపంలో పెన్నా నది మీద ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట ( డ్యామ్ ) నిర్మించబడింది. ఈ ఆదినిమ్మాయపల్లికి కొంచెం ఎగువన పెన్నా నదిలో కుందూపాపాగ్నిపాగేరు వంక నదులు వచ్చి కలుస్తాయి. ఈ నదులు అన్ని కలిసి ఇక్కడ అద్భుతమైన జలపాతాన్ని ఏర్పరుస్తున్నాయి. మరియు ఇక్కడికి సమీపంలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన “ పుష్పగిరి ” కూడా వుంది. పుష్పగిరిని సందర్శించేవారు ఈ ఆదినిమ్మాయపల్లి జలపాతంను కూడా సందర్శిస్తారు. ముఖ్యంగా ప్రతి ఆదివారం నాడు ఇక్కడకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ చాలా మంది చేపలు పట్టేవారు చేపలు పడుతూ వుంటారు. మరియు వాటిని అక్కడే అమ్ముతుంటారు కూడా.  

ఎలా చేరుకోవాలి ?

మనం ఈ ఆదినిమ్మాయపల్లి జలపాతంను ఖాజీపేట నుండి మరియు కమలాపురం నుండి చేరుకోవచ్చు. ఇది ఖాజీపేట నుండి 10 km మరియు కమలాపురం నుండి 11 km దూరంలో వుంది. ఆదినిమ్మాయపల్లికి నేరుగా బస్సు సౌకర్యం లేదు కానీ ప్రైవట్ ఆటోలు అందుబాటులో వుంటాయి. 

10. పెద్దచెలిమి జలపాతం :

పెద్దచెలిమి జలపాతం కడప జిల్లాలోని వీరపునాయినిపల్లె మండలం లోని అనిమెల గ్రామంలో వుంది. ఈ ప్రదేశానికి సమీపంలో “ శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం ” వుంది. ఆ ఆలయానికి చుట్టు 101 చెలిమిలు వున్నాయిఅందులో ఒకటి ఈ పెద్దచెలిమి. ఇక్కడ అతిపురాతనమైన ఒక శివాలయం వుంది. ఆ శివాలయానికి సమీపంలో కొండలో నుండి నీరు ప్రవహిస్తూ వుంటుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి తెలియదు. ఆ నీరు అలా ప్రవహిస్తూ కొండ క్రింది భాగంలో ఒక చిన్న జలపాతాన్ని ఏర్పరుస్తుంది. చుట్టు కొండల మధ్య ఒక లోతైన లోయలో ఈ ప్రదేశం వుంటుంది.

ఎలా చేరుకోవాలి ?

ఈ పెద్దచెలిమి జలపాతం వీరపునాయునిపల్లె నుండి 5 km దూరంలో వుంది. ఇక్కడికి నేరుగా బస్సు సౌకర్యం లేదు. కానీ ఇక్కడికి సమీపంలో వున్న వీరపునాయునిపల్లెకు వేంపల్లి మరియు యర్రగుంట్ల నుండి బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుండి ఆటోలు అందుబాటులో వుంటాయి.
మిగిలిన జలపాతాల గురించి తరువాత ఆర్టికల్లో తెలుసుకుందాం. ఇంకా మీకు ఈ 5 జలపాతాల గురించి సమాచారం కావలసి వుంటే క్రింద కామెంట్ చేయండి.
గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు