శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో వున్న ప్రసిద్ధ శైవక్షేత్రము. మెలికలు తిరుగుతూలోయలు దాటుతూ దట్టమైన అడవుల మధ్య భక్తజనులను బ్రోచెందుకు వెలసిన ఆ పరమేశ్వరుని దివ్యధామమ్ ఈ శ్రీశైలం. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది మరియు అష్టాదశశక్తిపీఠాలలో ఆరవది. ఇక్ష్వాకులుపల్లవులువిష్ణుకుండినులుచాళుక్యులుకాకతీయులురెడ్డిరాజులువిజయనగర రాజులుశివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం ఈ శ్రీశైలం.
శ్రీశైలానికి సిరిగిరిశ్రీ గిరిశ్రీ పర్వతము మొదలైన పేర్లు వున్నాయిశ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు 500 వరకు శివలింగాలు వుంటాయి. ఈ శ్రీశైలంలో వసతిగా దేవస్థానం వారి సత్రములుక్యాటేజీలు మరియు చాలా హోటల్స్ అందుబాటులో వున్నాయి. శ్రీశైలక్షేత్రంలోని దర్శనీయ ప్రదేశాల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు :

  • శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం
  • శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం
  • పంచపాండవుల దేవాలయములు 
  • మనోహర గుండము
  • వృద్ద మల్లికార్జున లింగము
  • శ్రీశైలం రిజర్వాయర్
  • పాతాళగంగ
  • సాక్షి గణపతి ఆలయం
  • శ్రీశైల శిఖరం
  • ఫాలధారపంచధారలు 
  • హఠకేశ్వరం
  • చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం
  • శివాజీ సాంస్కృతిక స్మారక భవనం
  • కదళీవనం
  • భీముని కొలను
  • అక్కమహాదేవి గుహలు
  • మల్లేలతీర్థం
  • ఇష్టకామేశ్వరీదేవీ ఆలయం
  • సిద్దరామప్ప కొలను మొదలైనవి

శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం :

శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం అభేధ్యమైన ప్రాకారము కలిగి లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్పసంపదతో అలరారే అందమైన దేవాలయంగా అభివర్ణింపబడుతుంది.

శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయం :

ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయంగా వెనుతికెక్కింది. ఈ ఆలయంలో పార్వతీ దేవి భ్రమరాంబికా అమ్మవారిలా భక్తుల పూజలందుకుంటుంది. ఈ దేవాలయంలో గర్భాలయం యొక్క వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మని బ్రమరనాదం వినిపిస్తుంది.  

మనోహర గుండము :

శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఈ ప్రదేశం కూడా ఒకటి. ఈ ప్రదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీళ్ళు ఈ గుండంలో ఉంటాయి. మహానందిలోని కోనేటి నీటిలో క్రింద రూపాయి వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది కదా అలాగే ఈ చిన్ని గుండంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

పంచ పాండవుల దేవాలయాలు :

పాండవులు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని వారి పేరున ఐదు దేవాలయాలను ప్రధాన దేవాలయము యొక్క వెనుక భాగమున నిర్మించిఅక్కడ శివలింగములను ప్రతిష్టించిరి. పాండవులు నిర్మించిన ఆలయాలు కనుక వాటిని పంచ పాండవుల దేవాలయాలు అని పిలుస్తున్నారు.

వృద్ధ మల్లికార్జున లింగము :

ప్రధాన దేవాలయ ఆవరణలో అద్దాల మండపంమనోహర గుండమువృద్ధ మల్లికార్జున స్వామి ఆలయాలు వున్నాయి. ఇక్కడి వృద్ద మల్లికార్జున స్వామి దేవాలయంలో వున్న శివలింగం ముడతలు పడిన ముఖంలా వున్న శివలింగంకనుక దీనిని వృద్ధ మల్లికార్జున లింగంగా పిలుస్తారు.

శ్రీశైలం ప్రాజెక్టు :

శ్రీశైలం ప్రాజెక్టు (లేదా) శ్రీశైలం డ్యామ్ (రిజర్వాయర్) కృష్ణా నది పైన నిర్మించిన భారీ బహులార్థక ప్రాజెక్టు. కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు తరువాతి కాలంలో నీటి పారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది. ఈ రిజర్వాయర్ పొడవు దాదాపు 512 మీటర్లు వుంటుంది మరియు దీనికి మొత్తం 12 క్రెస్ట్ గేట్లు కలవు. ఈ శ్రీశైలం డ్యామ్ యొక్క మొత్తం సామర్థ్యం దాదాపు 263 T.M.Cలు వుంటుంది.

జల విద్యుత్ కేంద్రం :

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంను రెండు భాగాలుగా విభజించారు అవి
కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం :
దీనిలో మొత్తం 7 యూనిట్లు కలవుఒక్కొక్క యూనిట్ 110 MWల విద్యుత్ను ఇస్తుంది అంటే మొత్తంగా దీని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం వచ్చేసి 770 MWలు అన్నమాట.
ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం :
ఈ విద్యుత్ కేంద్రం భూగర్భంలో నిర్మించబడింది. దీనిలో మొత్తం 6 యూనిట్లు కలవుఒక్కొక్క యూనిట్ 150 MWల విద్యుత్ని ఇస్తుంది అంటే దీని మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం వచ్చేసి 900 MWలు అన్నమాట.

మండపాలు, పంచ మఠాలు ప్రాంతం :

  • ఘంటా మఠం
  • భీమ శంకర మఠం
  • విభూతి మఠం 
  • సారంగధర మఠం
  • రుద్రాక్ష మఠం 
  • విశ్వామిత్ర మఠం మొదలైనవి. ఈ మఠాలన్నింటిని ప్రధాన ఆలయం యొక్క చుట్టుప్రక్కల చూడవచ్చు.

శివాజీ సాంస్కృతికస్మారక భవనం :

శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో శివాజీ స్మారక భవనం ఒకటి. ఇక్కడ శివాజీ జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూశివాజీ కాంస్య విగ్రహం కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని తప్పకుండా దర్శించండి.

పాతాళ గంగ :

శ్రీశైలం ప్రక్కనే కృష్ణా నది ప్రవహిస్తుంది కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో వుంది నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుందిఅందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణా నదిలో సాన్నం చెయ్యాలి. ఈ కృష్ణా నదినే ఇక్కడ “పాతాళ గంగ” అని అంటారు. 2004లో పాతాళ గంగకు రోప్వేను (Rope way) ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుంది. అక్కడే వున్న త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పని సరిగా చూడవలసిన వాటిలో ఒకటి.

సాక్షి గణపతి ఆలయం :

ఈ ఆలయం ప్రధాన ఆలయంనకు 2 Kmల దూరంలో ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటేశ్రీశైలంలో వున్న స్వామి వారిని (శివుడిని) దర్శించితే కైలాస ప్రదేశానికి అనుమతి లభిస్తుందటకాబట్టి అందరూ కూడా స్వామి వారిని దర్శించుకోవడానికి శ్రీశైలంకు వస్తుంటారు. అయితే మనం శ్రీశైలంనకు వచ్చినట్టు కైలాసంలో  స్వామికి (శివుడికి) ఈ సాక్షి గణపతే సాక్షం చెబుతాడటఅందువలన ఇతనిని సాక్షి గణపతి అంటారు.

శ్రీశైల శిఖరం :

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది ఈ శ్రీశైల శిఖరం. ఇది ప్రధాన ఆలయం నుండి 8 కిలోమీటర్లు మరియు శ్రీశైలం డ్యాం నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. శిఖర దర్శనము అంటే ప్రక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదుఈ శిఖరేశ్వరంపై నుండి దూరంగా వున్న ఆలయ శిఖరాన్ని చూడటం.

పాలధారపంచధారాలు :

శిఖరేశ్వరమునకుసాక్షి గణపతి గుడికి మధ్యలో “హటకేశ్వరం”నకు సమీపాన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో “జగదుర్గ శంకరాచార్య” తపమాచరించిన ప్రదేశం వుంది. ఆ ప్రదేశమునే పాలధార మరియు పంచధారలు అంటారు. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు కూడా  వున్నాయి. కొండ పగులుల నుండి పంచదారలతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూఒకొక్క ధార ఒకొక్క రుచితో వుండుట ఇక్కడి ప్రత్యేకత.

కదళీవనం :

ఇక్కడ అక్కమహాదేవి గారు అవతార సమాప్తిగావించారని ప్రతీతి. అంతేకాకుండా ఇక్కడే శ్రీ నృసింహ సరస్వతి స్వామి గారు అంతర్థానమయ్యారట.

హఠకేశ్వరం :

ఇది శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంనకు 3 km దూరంలో వుంది. శివ భక్తుడు అయిన కుమ్మరి కేశప్పకు శివుడు అటికలో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశం హటకేశ్వరం. పరమ శివుడు అటిక అనగా ఉట్టి లేదా కుండ పెంకులో వెలియడంతో ఈ ఆలయం లోని ఈశ్వరునికి అటికేశ్వరుడు అని పేరు వచ్చిందిఅదే కాలక్రమేన హటకేశ్వరంగా మారింది. ఇక్కడి పరిసర ప్రాంతాలలో పలు ఆశ్రమాలుమఠాలు వున్నాయి.

భీముని కొలను :

హటకేశ్వరం సమీపంలో వున్న కాలిబాట భీముని కొలనుకు దారితీస్తుంది. దాదాపు 2km వెళ్తే త్రివేణిత్రిపర్వత సంగమానికి చేరుకుంటారు. ఇక్కడ తూర్పు నుండి ఒక సెలయేరుదక్షిణం నుండి ఒక సెలయేరు వచ్చి చిన్న చిన్న జలపాతాలుగా దూకుతుంటాయివీటితో ఏర్పడిన కొలనునే భీముని కొలను అంటారు. ఈ కొలను ఒడ్డున భీమాంజనేయుల విగ్రహాలు కనిపిస్తాయిఇక్కడే పురాతన శివాలయం కూడా వుంది.

అక్కమహాదేవి గుహలు :

శ్రీశైలం లోని కృష్ణా నది గుండా బోటింగ్ ద్వారా అక్కమహాదేవి గుహలకు చేరుకోవచ్చు. ఇక్కడికి చేసే ప్రయాణం మీకు ఒక సాహసోపేత అనుభూతిని అందిస్తుంది. అక్కమహాదేవి ఈ గుహలలో తపస్సు చేసినందున ఈ ప్రదేశాన్ని అక్కమహాదేవి గుహలని పిలుస్తారు. ఈ గుహలలో ఒక శివలింగాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు.

ఇష్టకామేశ్వరీదేవి ఆలయం :

శ్రీశైలంలో ఒక రహస్య ప్రదేశం వుందిఆ ప్రదేశంలో ఎంతో మహిమ గల ఇష్టకామేశ్వరీదేవి ఆలయం వుంది. ఇక్కడి అమ్మవారి దగ్గర ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. శ్రీశైలం నుండి దాదాపు 20 km దూరంలో దట్టమైన నల్లమల అడవులు మధ్య ఈ ఆలయం నెలకొనివుంది.

ఇతర ప్రదేశాలు :

మీరు ఇంకా ఈ శ్రీశైలంలో చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియంమల్లెల తీర్థంసిద్దరామప్ప కొలను మొదలగు వంటి అద్భుతమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.

గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు ! 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు