about gandikota fort
గండికోటలో చూడవలసిన ప్రదేశాలు
ఇప్పుడు నేను ఈ ఆర్టికల్లో
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాస్ట్రంలో వున్న కడప జిల్లాలోని గండికోటలో చూడవలసిన
ప్రదేశాల గురించి చెప్పబోతున్నాను. చుట్టూ లోతైన లోయలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన
శత్రుదుర్భేద్యమైన కొండలు, కోట లోపలి వారికి బలమైన మరియు సహజ
సిద్ధమైన రక్షణ కవచముగా వుండే విధంగా నిర్మించారు ఈ గండికోట. గండికోట సమీప
పట్టణమైన జమ్మలమడుగు నుండి 14 km దూరంలో
వుంది మరియు కడప నుండి దాదాపు 90 km దూరంలో
వుంది. ఈ గండికోటలో చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగాయి.
1213లో కాక మహారాజులు అనే ఆయన ఈ గండికోటను నిర్మించారట. గండికోట లోపల మరియు వెలువల కూడా అనేక ఆలయాలను నిర్మించారు. రంగనాథ ఆలయం, శివాలయం, భైరవుని ఆలయం, వీరభద్ర దేవాలయం మొదలైన దేవాలయాలు వున్నాయి. ప్రస్తుతం ఈ ఆలయాలన్ని శిధిలావస్థలో వున్నాయి. రాయల కాలం తరువాత గండికోట మహమ్మదీయుల పరమైంది. ఆ సమయంలో గండికోట ఆలయాలన్నీ ధ్వంసం చేయబడ్డాయి. కొన్ని ఆలయాలలో మూల విగ్రహాలే కనపడవు.
1213లో కాక మహారాజులు అనే ఆయన ఈ గండికోటను నిర్మించారట. గండికోట లోపల మరియు వెలువల కూడా అనేక ఆలయాలను నిర్మించారు. రంగనాథ ఆలయం, శివాలయం, భైరవుని ఆలయం, వీరభద్ర దేవాలయం మొదలైన దేవాలయాలు వున్నాయి. ప్రస్తుతం ఈ ఆలయాలన్ని శిధిలావస్థలో వున్నాయి. రాయల కాలం తరువాత గండికోట మహమ్మదీయుల పరమైంది. ఆ సమయంలో గండికోట ఆలయాలన్నీ ధ్వంసం చేయబడ్డాయి. కొన్ని ఆలయాలలో మూల విగ్రహాలే కనపడవు.
గండికోటలో చూడవలసిన ప్రదేశాలు :
- కోట ద్వారాలు
- కోట గోడ
- గండికోట చార్మినార్
- కారాగారము
- మాధవరాయ స్వామి ఆలయం
- కత్తుల కోనేరు
- జుమ్మా మస్జిద్
- ధాన్యాగారము
- రంగనాయకుల స్వామి ఆలయం
- పెన్నా లోయ దృశ్యం
- గండికోట జలపాతం
కోట ముఖ ద్వారం :
గండికోట లోపలికి ప్రవేశించిన వెంటనే మనకు కనపడేది కోట యొక్క ప్రధాన ముఖ ద్వారం. ఈ కోట యొక్క ప్రధాన ముఖ ద్వారానికి ఎతైన కొయ్య తలుపులు ఇనుప రేకులతో తాపడం చేయబడి వుంటాయి, తలుపుల పైన రక్షణ కోసం ఇనుప సూది మేకులు వున్నాయి. ఈ కోట ద్వారానికి పక్కన చిన్న సొరంగం లాగా వుంటుంది అందులోకి వెళ్ళి చూస్తే, మన ఇళ్లకు గడెమాను (old lock system) వున్నట్టుగానే ఈ గండికోట తలుపులకు కూడా ఒక గడిమాను వుంది. ఈ గడిమానును అప్పట్లో ఒక చాకలి ఆవిడ తన ఎడమ చేత్తో వేసేదని ఇక్కడి ప్రజలు అంటుంటారు. ఇప్పటికీ కూడా మనం ఆ గడిమానును ఇక్కడ చూడవచ్చు.కోట గోడ :
వృత్తాకారంలో వుండే ఈ కోట యొక్క చుట్టు కొలత దాదాపు ఐదు మైల్లు వుంటుంది. దాదాపు 40 బురుజులతో నిర్మితమైన ఈ గండికోట ఎంతో సుందరంగాను, దృడంగాను వుంటుంది. ఈ కోట ప్రాకారం ఎర్రటి సున్నని శానపు రాళ్ళతో నిర్మించారు. ఈ కోట గోడలు దాదాపు 10 నుండి 13 మీటర్ల ఎత్తు వుంటాయి. గోడ పైభాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో మార్గం వుంటుంది. ఈ కోట గోడ పైన నుండి చూస్తే కోటలోని ఆలయాలు, చార్మినార్, జైలు మొదలనవి కనిపిస్తాయి.గండికోట చార్మినార్ :
హైదరాబాదులో చార్మినార్ వున్నట్లే ఈ గండికోటలో కూడా ఒక చార్మినార్ వుంది. గండికోట యొక్క ముఖ ద్వారాన్ని దాటుకొని లోనికి ప్రవేశించిన వెంటనే మనకు ఈ చార్మినార్ దర్శనమిస్తుంది. హైదరాబాదు లోని చార్మినారుకు పైకి ఎక్కడానికి మెట్లు వున్నట్టు ఈ గండికోట చార్మినారుకు మెట్లు లేవు. ఈ గండికోట చార్మినార్ కోట లోపలికి వచ్చే వారందరికీ స్వాగతం పలుకుతూ వుంటుంది.జైల్ ( కారాగారము ) :
ఈ కారాగారంను చార్మినారుకు కొంచెం ముందు భాగంలో చూడవచ్చు. గండికోటలో ఎలాంటి నేరాలకైనా క్రూరమైన, కఠినమైన శిక్షలు ఉండేవి. చిన్న చిన్న దొంగతనాలు చేసిన వారికి వాళ్ళ కాళ్ళు మరియు చేతులు తీసేశేవారు, ఒకవేళ రాజ ద్రోహానికి పాల్పడితే వాళ్ళ కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రలతో కొట్టి చంపేసేవారు. పెద్ద దొంగతనాలు చేసిన వారిని గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపెసేవారు. ఇలాంటి క్రూరమైన శిక్షలు జరిగిన ప్రదేశం ఇక్కడి జైలు. మనం ఈ ప్రదేశాన్ని ఇప్పటికీ కూడా ఇక్కడ చూడవచ్చు.మాధవరాయ స్వామి ఆలయం :
కారాగారం చూసిన తరువాత దానికి పక్కన ఒక మార్గం వుంటుంది, ఆ మార్గంలో వెళ్తే ఇక్కడి మాధవరాయ స్వామి ఆలయం దర్శనమిస్తుంది. పూర్వం విజయనగర మహా సామ్రాజ్యాన్ని హరహర బుక్క రాయలు పాలిస్తున్న కాలంలో ఆయన కాశీ యాత్ర చేసి తిరుగు ప్రయాణంలో గండికోటలో విశ్రాంతి తీసుకున్నారట, ఆ సమయంలో ఆయనకు కలలో మాధవరాయ స్వామి దర్శనమిచ్చి ఈ ప్రదేశం అతి పవిత్రమైందనీ, ఇక్కడ తనకు ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించినట్టు అనిపించిందట. ఆ విధంగా నిర్మించినదే ఇక్కడి మాధవరాయ స్వామి ఆలయం. ఆలయ నిర్మాణంతో పాటు ఆ స్వామి నిత్యారాధన కోసం అర్చకులను ఏర్పాటు చేసి వారి జీవనానికి మాన్యాలు కూడా ఏర్పాటు చేసినట్టు అక్కడి శిలాపలకాల మీద ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆలయంలో ఎటువంటి దేవతా విగ్రహాలు లేవు. కానీ ఈ ఆలయ గోపురం మీద శిల్ప కళా చాలా అద్బుతంగా వుంటుంది.కత్తుల కోనేరు ( పెద్ద కోనేరు ) :
గండికోటలో నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు ఇంకా చాలా చెరువులు బావులు వున్నాయి. పూర్వం యుద్ధం చేసి కత్తులకు అంటిన రక్తపు మరకలు కడగటానికి ఈ కోనేరు లోని నీటిని వాడుకునే అందువలన దీనికి కత్తుల కోనేరు అని పేరు వచ్చిందని కొందరి భావన. ఈ కోనేరు ఇక్కడి జుమ్మ మసీదుకు ఎదురుగా వుంటుంది అందువలన పూర్వం ఈ నీటిని కాలకృత్యాలు తీర్చుకోవడానికి (వుజూ చేసుకోవడానికి) కూడా వాడే వారని కొందరు అంటున్నారు. ఇక్కడ వున్న కొనేరులన్నింటిలో ఈ కొనేరే పెద్దది అందువలన దీనిని పెద్ద కోనేరు అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ కోనేటి లోని నీటిని ఇక్కడి ఊరి ప్రజలు తాగడానికి ఉపయోగిస్తున్నారు.జుమ్మా మసీదు :
గోల్కొండ కోట నవాబు ప్రతినిధిగా గండికోటను పాలించిన మీర్ జుమ్లా హయాంలో ఇక్కడ జుమ్మా మసీదును నిర్మించారు. ఈ మసీదు ఇప్పటికీ సుందరమైన కట్టడాలలో ఒకటిగా పిలువబడుతుంది. మసీదు ముందు భాగంలో భక్తులు నమాజు చేసుకోవడానికి వీలుగా విశాలమైన అరుగు వుంది. మసీదు ప్రాకారం లోపల 64 గదులు, బయట 32 గదులు వుంది పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది. ఈ మసీదు యొక్క నిర్మాణ శైలి చాలా అద్బుతంగా వుంటుంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగాయి, జరుగుతున్నాయి కూడా.ధాన్యా గారము :
ఆ కాలంలో రైతులు పండించిన ధాన్యాలను ఒక
పెద్ద భవనంలో భద్రపరిచేవారు దానిని ధాన్యాగారం అంటారు. ఈ గండికోటలో కూడా ఒక
ధాన్యాగారం వుంది. ఈ ధాన్యాగారాము మసీదుకు ఎడమ భాగాన వుంటుంది ఇప్పటికీ కూడా మనం ఈ
భవనాన్ని ఇక్కడ దర్శించవచ్చు.రంగనాయకుల స్వామి ఆలయం :
ధాన్యాగారాన్ని చూసిన తరువాత దానికి పక్కన చిన్న గుట్ట పైన ఈ రంగనాయకుల స్వామి ఆలయం వుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయంలో కూడా ఎటువంటి దేవతా విగ్రహాలు వుండవు. కానీ ఆ నాటి శిల్పకళా మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి, మాధవరాయ స్వామి ఆలయం వలె ఎత్తైన గోపురం వుండదు మరి పూర్వం వుండేదేమో కచ్చితంగా తెలియదు.పెన్నానది లోయ :
శత్రువులు చొరబడకుండ చాలా పటిష్టంగా నిర్మించిన ఈ గండికోటలో ప్రకృతి రమణీయ దృశ్యాలకు ఎటువంటి కొదువలేదు. జూమ్మా మసీదు ముందు వున్న మార్గం పెన్నానది వైపు వెళ్తుంది, అక్కడి నుండి చూస్తే దాదాపు 300 అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో పెన్నా నది కనిపిస్తుంది. తనకు ఎవరడ్డు అంటూ కొండలను సైతం చీల్చుకుంటూ పెన్నా నది వురకలు వేసే చోట వున్న ఈ కోట పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అత్యంత వేగంతో అమితమైన ఉత్సాహంతో పరిగెత్తుతున్న పెన్నా నది ధాటికి నిశ్చలంగా వున్న కొండకు గండి ఏర్పడింది. ఈ కొండ మీద ఒక కోటను నిర్మించడంతో ఆ కోటకు “గండికోట” అనే పేరు వచ్చింది. ఈ పెన్నా లోయ గండికోటకు వచ్చే పర్యాటకులకు చాలా ఇస్టమైన ప్రదేశం. ఇక్కడ వున్న ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టి పడేస్తాయి. ప్రకృతి సౌందర్యంతో పాటు ఇక్కడ ఒక వింత కూడా వుంది అదేమిటంటే ఈ పెన్నా నది కొండపై నుండి రాయిని విసిరితే ఆ రాయి కింద నీటిలో పడదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ రాయిని నీటిలో వేయడానికి ప్రయత్నిస్తూనే వుంటారు. ఒకవేళ మీకు ఈ విషయం నమ్మశక్యం కాకపోతే ఈ సారి గండికోటకు వెళ్ళినప్పుడు ఒకసారి ప్రయత్నించి చూడండి.గండికోట జలపాతం :
గండికోట జలపాతం గండికోట నుండి 2km దూరంలో వుంటుంది. చాలా మంది ఇక్కడికి వెళ్ళరు ఎందుకంటే ఈ ప్రదేశం చాలా మందికి తెలియదు. ఈ జలపాతం గండికోటకు వెళ్లే మార్గంలో వున్న హరిత రిసార్ట్ కు సమీపంలో వుంటుంది, అక్కడ నరసింహ స్వామి పాద క్షేత్రము అని ఒక తోరణం వుంటుంది, ఆ మార్గంలో దాదాపు 1km వరకు నడుచుకుంటూ వెళ్తే ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. దారి పొడవునా ఒక తెల్లటి గీత వుంటుంది, ఆ గీతను అనుసరించి వెళ్తే మనం ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు.ఇతర ప్రదేశాలు :
ఇంకా ఇక్కడ చాలా కోనేరులు, బావులను చూడవచ్చు. ఇక్కడ అడ్వెంచర్ చేయడానికి చాలా సౌకర్యాలు అందుబాటులో వున్నాయి. గండికోటకు సమీపాన మరియు వెనుక భాగమున చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల గురించి ఇంకొక ఆర్టికల్లో తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.ఎలా చేరుకోవాలి ?
గండికోట జమ్మమడుగు నుండి 16km దూరంలో వుంది, గండికోటకు చేరుకోవడానికి జమ్మలమడుగు నుండి బస్ సౌకర్యం కూడా ఉంది. అయితే మీరు జలపాతంనకు వెళ్లాలంటే హరిత రిసార్ట్ వద్ద దిగి నడుచుకుంటూ వెళ్ళాలి.గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్‌లు