గోల్కొండ కోటలో చూడవలసిన ప్రదేశాలు

ఈ ఆర్టికల్లో భారతదేశంలోని అత్యుత్తమ కోటలలో ఒకటిగా పిలువబడుతున్న గోల్కొండ కోట గురించి చెప్పబోతున్నాను. గోల్కొండ కోట హైదరాబాద్ నగరానికి 11km దూరంలో వుంది. ఈ గోల్కొండ కోట మొత్తం 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి కొండ మీద కట్టారు. ఈ కోట రక్షణార్ధం దీని చుట్టూ పెద్దబురుజులు నిర్మించారు. ఈ గోల్కొండ కోట బురుజులతో సహా 5km చూట్టుకొలతను కలిగి వుంది. ఈ గోల్కొండ కోట నాలుగు వేరువేరు కోటల యొక్క సముదాయం. ఈ కోట మొత్తం 87 అర్ధచంద్రాకారపు బురుజులతో నిర్మించబడివుంది. కొన్ని బురుజులలో ఇప్పటికీ కూడా ఆ కాలంనాటి ఫిరంగులను చూడవచ్చు. ఈ కోట యొక్క బురుజులలో మొత్తం మూడు బురుజులు ముఖ్యమైనవి. అవి 1) పెట్ల బురుజు2) మూసా బురుజు3) మజును బురుజు వీటిలో “పెట్ల బురుజు” పెద్దది. ఈ కోటకు మొత్తం 9 ద్వారాలు వున్నాయి అవి :
1) ఫతే దర్వాజ
2) మోతి దర్వాజ
3) కొత్తకోట దర్వాజ
4) జమాలి దర్వాజ
5) బంజారి దర్వాజ
6) పటాన్ చెరువు దర్వాజ
7) మక్కా దర్వాజ డబుల్
8) బొదిలి దర్వాజ
9) బహిమని దర్వాజ

గోల్కొండ కోటలో చూడవలసిన ప్రదేశాలు :

బాలా హిస్సార్ :

ఈ కోట యొక్క 9 ద్వారాలలో 7వ ద్వారం అయిన “మక్కా దర్వాజ డబుల్” ద్వారా మాత్రమే సందర్శకులు కోట లోపలికి ప్రవేశిస్తారుదీనినే “బాలా హిస్సార్” అని పిలుస్తారు. ఈ బాలా హిస్సార్ ద్వారానికి ఎదురుగా ఒక గోడ వుంటుంది దీనిని “కర్టెన్ గోడ” అంటారు. ఈ బాలా హిస్సార్ ద్వారం వద్ద నిలబడి చప్పట్లు కొడితే ఆ శబ్దం కోట అంతా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ప్రమాద సంకేతాలు తెలుపుటకు ఉపయోగించేవారుకానీ ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది. ఈ బాలా హిస్సార్ ద్వారం నుండి గోల్కొండ కోట యొక్క శిఖరాన్ని చూడవచ్చుఈ శిఖరం ఎత్తు దాదాపు 480 అడుగులు వుంటుంది.

ఆయుధ భాండాగారం/ అస్లహ్ ఖానా :

బాలా హిస్సార్ ద్వారం తరువాత మూడు అంతస్తుల భవనం కనిపిస్తుంది దానిని “అస్లహ్ ఖానా” లేదా “ఆయుధ బాండాగారం” అని పిలుస్తారు. ఈ భవనంలోనే రాజులకు సంబధించిన ఆయుధాలన్నింటిని వుంచుతారు. ఈ భవనంలోని ప్రతి అంతస్తుకు కమాన్లు వున్నాయి. దీనిని క్రీ.శ. 16వ శతాబ్ధంలో నిర్మించారు.  

గోల్కొండ కోట కాలింగ్ బెల్ :

మన ఇళ్లకు కాలింగ్ బెల్ వున్నట్టుగానే ఈ గోల్కొండ కోటకు కూడా ఒక కాలింగ్ బెల్ వుంది. అయితే ఇక్కడ క్లాప్స్ (చప్పట్ల)ను “కాలింగ్ బెల్”గా వాడేవారుఅది ఎలా అంటే 1 క్లాప్ చేస్తే గెస్ట్ వచ్చారని2 క్లాప్స్ చేస్తే ఫ్రెండ్స్ వచ్చారని3 క్లాప్స్ చేస్తే కింగ్ వస్తున్నారు అని వారు సమాచారాన్ని ఇచ్చుకునేవారు.

తారామతి మస్జిద్ :

ఈ మసీదును కుతుబ్ షాహీల నిర్మాణ శైలికి చక్కని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దీనికి మూడు “గుంభజ్”లు వున్నాయి. వాటిలో మధ్యలో వున్నది మిగిలిన రెండింటి కన్నా పెద్దది. ఈ మసీదును కోటలోని రాణీలు ఉపయోగించుకోవడానికి నిర్మించారు.

రాణీమహల్ సముదాయం :

ఈ కోటలోని తెలుగు నర్తకీలు “తారామతి మరియు ప్రేమామతి” వారి యొక్క గెస్ట్ హౌస్ మరియు రాణిమహల్ సముదాయంను ఇక్కడ చూడవచ్చు.

నాట్య ప్రదర్శన శాల :

ఈ ప్రదేశంలో వెలుతురు కోసం వజ్రాలను ఉపయోగించేవారు. పూర్వం కుతుబ్ షాహీల కాలంలో వజ్రాల వ్యాపారం బాగా జరిగేది. ఈ గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతిని సంపాదించింది. ఈ ప్రదేశంలోనే తారామతి మరియు ప్రేమామతి యొక్క మేకప్ రూమ్స్ వున్నాయి.

అంబర్ ఖానా :

ఇది రాజ కుటుంబీకుల ధాన్యాగారం. ఈ భవంతిలో ఆహారధాన్యాలను నిల్వ వుంచేవారు. దీనిని క్రీ.శ. 1642లో అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో “ఖైరత్ ఖాన్” అనే వ్యక్తి నిర్మించినట్లు అక్కడి శాసనాన్ని బట్టి తెలుస్తుంది.

ఇబ్రాహీం మసీదు :

కుతుబ్ షాహీ నిర్మాణశైలికి ఇది ఒక చక్కని నిదర్శనం. సాదాగానుసుందరంగాను వున్న ఈ మసీదుకు తొమ్మిది కమానులు వున్నాయి. మసీదుకు వెలుపలి భాగంలో గోడలకు గచ్చుతో చేసిన అలంకారం కుతుబ్ షాహీ శైలికి మంచి నిదర్శనంగా  చెప్పవచ్చు.

మహాకాళి ఆలయం :

ఇక్కడ ప్రతి ఆషాడ మాసంలో బోనాల జాతరలు జరుగుతాయి. జంటనగరాల నుండి అనేక మంది భక్తులుసందర్శకులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.  

దివానా ఖాన్ /దర్బార్ హాల్ :

కుతుబ్ షాహీలు నిర్మించిన వాటిలో ఇది ప్రధానమైనది. శత్రువులు ఎటువైపు నుండి వస్తున్నారో ఎక్కవగా ఇక్కడి నుండే చూసేవారు. మనం బాలాహిస్సార్ ద్వారం వద్ద కొట్టిన చప్పట్ల శబ్దం ఇక్కడి వరకు చాలా స్పస్టంగా వినిపిస్తాయి. ఇక్కడ ఒక సొరంగ మార్గం వుందట ఆ మార్గం ఈ దర్బార్ హాల్ నుండి కింద వున్న ఒక ప్రదేశానికి తీసుకువెళ్తుంది అని అంటారు.

రామదాసు బందీఖానా :

ధాన్యాలను భద్రపరచడానికి ఉపయోగించే ఈ భవనాన్ని “అబుల్ హాసన్ తానిషా” కారాగార గృహంగా మార్చాడు. ఇందులో రామదాసును భంధించాడు. రామదాసు భద్రాచలంలో రామాలయాన్ని నిర్మిస్తున్నప్పుడుఆలయనిర్మాణానికి డబ్బులు చాలక అతను వసూలు చేసిన శిస్తు నుండి కొంత డబ్బును వినియోగించాడు. దీంతో నవాబుగారు కొప్పడి గోపన్నకు 12ఏళ్లు జైలుశిక్ష  విధించాడు. ఖైదుగా వున్న రామదాసు జైలు గోడపైన శ్రీ సీతారాములక్ష్మణాంజనేయ చిత్రాలను చిత్రించుకొని పూజించేవారు. ఇప్పటికీ కూడా మనం ఆ దృశ్యాలను  ఈ గోల్కొండలో చూడవచ్చు.  

అక్కన్న-మాదన్న కార్యాలయం :

అక్కన్న-మాదన్నల కార్యాలయాలంగా పిలవబడుతున్న ఈ నిర్మాణం పాలనాకార్యకలాపాలకు ఉపయోగపడేది. ఇక్కడ లోకల్ ప్రజలు మాదన్న కార్యాలయాన్ని సంప్రదించేవారు. బయటినుంచి వచ్చే ప్రజలు అక్కన్న ఆఫీసులో కలిసేవారు. ఈ ఆఫీసులన్నింటికి ఎటువంటి తలుపులు వుండవు కేవలం కార్టెన్స్ ను వాడేవారు.

నగీనాబాగ్  :

నగీనాబాగ్ అంటే “ఉద్యాన వనాలలో మణిహారం” అని అర్థం. మొగల్ ఉద్యానవనాలకు ఇది ఒక చక్కని నమూనాగా  వుంది. 

శవ స్నాన శాల :

పర్షియన్-టర్కిష్ శైలిలో నిర్మించిన ఈ కట్టడం రాజకుటుంబీకుల మృతదేహాలకు పవిత్రస్నానం చేయించటానికి ఉపయోగించేవారు.  ఇందులో రెండు తొట్టెలు వుంటాయిఒక తొట్టెలోకి చల్లని నీరుమరొక తొట్టెలోకి వేడి నీరు వచ్చే విధంగా “అండర్ గ్రౌండ్”లో కాలువలను నిర్మించారు.

గోల్కొండ కోట చరిత్ర :

పూర్వం గొర్రెల కాపరులు గొర్రెలు మేపుకునే ప్రాతంలో వున్న కొండ కాబట్టి దీనిని మొదట్లో “గొల్లకొండ” అనేవారట అదే కాలక్రమేన “గోల్కొండ”గా ప్రసిద్ధి చెందింది అని ఒక కథనం. క్రీ.శ. 1083 నుండి 1323 వరకు “కాకతీయులు” ఈ గోల్కొండ కోటను పరిపాలిస్తూ వుండేవారు.  క్రీ.శ. 1309లో “అల్లా-ఉద్దీన్-ఖిల్జీ” సేనాపతి అయిన “మాలిక్ కపూర్” వరంగల్ పైన దాడి చేసి “2వ ప్రతాప రుద్రుణ్ణి” ఓడించి అతని నుండి కప్పంను వసూలు చేశాడు. తరువాత 1323లో “ఘియాజుధిన్ తుగ్లక్” కుమారుడు “మహమ్మద్-బీన్-తుగ్లక్” దాడితో “కాకతీయ రాజ్యం” అంతం అయ్యింది. “మహమ్మద్-బీన్-తుగ్లక్” వరంగల్ ను “సుల్తాన్ పూర్”  గా పేరు మార్చాడు. మళ్ళీ 1336లో “ముసునూరి కమ్మనాయకులు” “మహమ్మద్-బీన్-తుగ్లక్”ను ఓడించి “గోల్కొండ”ను తిరిగి సాధించారు. మళ్ళీ 1364లో “ముసునూరి కాపయనాయకుడు” గోల్కొండ కోటను “బహమనీ సుల్తాను” అయిన “మొదటి మహమ్మద్ షా”కు అప్పగించి సంధి చేసుకున్నాడు. బహమనీ సుల్తాన్ “షిహబుద్ధీన్ మహమ్మద్ ( నాల్గవ మహమ్మద్ షా )” కాలంలో “బహమనీ రాజ్యం” 5 స్వాతంత్ర్య రాజ్యాలుగా విడిపోయింది. అందులో ఒకటిగా క్రీ.శ. 1518లో “కుతుబ్ షాహీ వంశానికి” చెందిన “కులీ కుతుబ్ ఉల్ ముల్క్” ఈ గోల్కొండ రాజ్యంను స్థాపించాడు. సుల్తాన్ కులీ ఈ గోల్కొండ రాజ్యాన్నికోటనుబలోపేతం చేయడానికి చాలా కృషి చేశాడు. గోల్కొండ కోటలో అనేక రాజప్రసాదాలనుభవనాలనుతోటలనుమసీదులను నిర్మించాడు. ఇతను( కులీ కుతుబ్ ఉల్ ముల్క్) తన కుమారుడు అయిన “జంషీద్”చే హత్య చేయబడతాడుదీంతో “జంషీద్” గోల్కొండ కోట రాజు అవుతాడు. జంషీద్ తరువాత “ఇబ్రాహీం కులీ కుతుబ్ షా రాజు అవుతాడు. ఇతని అల్లుడు “హజరత్ హుస్సేన్ షా వలి” “హుస్సేన్ సాగర్”ను 1526లో నిర్మించాడు. ఇతని తరువాత “మహమ్మద్ కులీ కుతుబ్ షా” రాజు అవుతాడు ఇతను 1593లో “ప్లేగు” వ్యాధి నిర్మూలనకు గుర్తుగా “చార్మినార్”ను నిర్మించాడు. అలాగే హైదరాబాదులోని “మక్కా మసీదు”కు పునాదులు వేశాడు తరువాత “ఔరంగజేబు” దీనిని పూర్తి చేశాడు. తరువాత “అబ్దుల్ కుతుబ్ షా” రాజు అవుతాడు ఇతని కాలం లోనే “కోహినూర్” వజ్రం కృష్ణా డెల్టా లోని కొల్లూరులో లభించిందని ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి “ట్రావెర్నియార్” తెలిపారు. ఇతని కాలంలోనే “షాజహాన్” గోల్కొండ పైన దాడి చేయగా ఓడిన “అబ్దుల్లా కుతుబ్ షా” షాజహాన్ తో సంధి చేసుకొని మోగల్స్ కు సామంత రాజ్యం అయ్యింది. క్రీ.శ. 1657లో కోహినూర్ వజ్రంను “అబ్దుల్లా కుతుబ్ షా” “షాజహాన్”కు బహుమానంగా ఇస్తాడు. తరువాత కుతుబ్ షాహీ వంశంలో చివరి వాడు అయిన “అబుల్ హాసన్ తానిషా” గోల్కొండను పాలిస్తాడు. ఇతని కాలంలోనే “కంచర్ల గోపన్న (రామదాసు)” భద్రాచలంలో రామాలయమను నిర్మించాడు. ఆలయనిర్మాణానికి డబ్బులు చాలక తాను వసూలు చేసిన శిస్తు నుండి కొంత సొమ్మును ఆలయనిర్మాణానికి ఉపయోగిస్తాడు. దీంతో నవాబుగారు ( అబుల్ హాసన్ తానిషా ) గోపన్నకు జైలుశిక్ష  విధించాడు. 1507 నుండి దాదాపు 62 సంవత్సరాల కాలములో ఈ గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్థులు నల్లరాతికోటగా తయారుచేశారు. ఈ కోటలో కుతుబ్ షాహీ వంశస్థుల పాలన 1687లో “ఔరంగజేబు” విజయంతో అంతమైయింది. ఆ సమయంలో ఔరంగజేబు కోటను నాశనం చేశాడు. మొగలుల కాలంలో ఈ గోల్కొండ రాజ్యం 1687 నుండి 1724 వరకు ఆధీనంలో వున్నినది. తరువాత 1724లో “నిజాం ఉల్ ముల్క్” తిరుగుబాటు చేసి దక్కన్ లో “నిజాం రాజ్యాన్ని” స్థాపించాడు. దీనికి మొదటగా “ఔరంగాబాద్” రాజధానిగా వుండగా తరువాత “హైదరాబాదు”కు రాజధానిని మార్చాడు. నిజాంలు మోగల్స్ నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948 వరకు పరిపాలించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు