ప్రొద్దుటూరు పట్టణంలో చూడవలసిన ప్రదేశాలు

దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరుపుకుంటారు. మైసూరుకలకత్తాఒడిషాతెలంగాణవిజయవాడ మొదలైన ప్రదేశాలలో ఒక్కోచోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. అయితే దసరా ఉత్సవాలలో “రెండవ మైసూరు” గా పేరు పొందిన ప్రొద్దుటూరు పట్టణంలో చూడవలసిన ప్రదేశాల గురించి ఈ ఆర్టికల్లో చెప్పబోతున్నాను. ప్రొద్దుటూరు పట్టణం భారతదేశం లోని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న కడప జిల్లాలో వుంది. ఈ ప్రొద్దటూరు పట్టణం కడప నగరానికి 60 km దూరంలో వున్న ప్రముఖ వ్యాపార మరియు యాత్రా స్థలం. ప్రొద్దుటూరులో దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతారుఅందుకే ఈ  ప్రొద్దుటూరును “రెండవ మైసూరు” గా పిలుస్తారు. మరియు బంగారువెండి నగల వ్యాపారంలో ప్రొద్దుటూరు బాగా ప్రసిద్ధి చెందిందిఅందుకే దీనిని “రెండవ బొంబాయి” అని కూడా పిలుస్తారు.

ప్రొద్దుటూరు పట్టణంలో చూడవలసిన ప్రదేశాలు : 

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ( ముక్తి రామేశ్వరం )
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం ( అమ్మవారి శాల )
శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం
శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం ( శివాలయం )
శ్రీ రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు మొదలైనవి

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ( ముక్తి రామేశ్వరం) :

పెన్నా నదిగా పిలువబడే పినాకినీ  నది ఒడ్డున  ముక్తి రామేశ్వరం” అని పిలువబడే ఒక ప్రసిద్ద దేవాలయం వుంది. ఈ ఆలయానికి చాలా విశిస్టత వుంది అదేమిటంటేపురాణ కథల ప్రకారం శ్రీ రాముడు లంకాధిపతైన రావణుడుని సంహరించిన తరువాత ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు బ్రహ్మహత్యపాతకం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటబడిందటదాని నుంచి విముక్తుడు కావడానికి శ్రీ రాముడు పినాకిని నది తీరాన గల ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేయడానికి నిశ్చయించుకున్నాడు. దీని కోసం ఒక సుముహూర్తాన్ని నిర్ణయించిహనుమంతుడిని కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని పంపగా హనుమంతుడు సకాలంలో తిరిగిరాకపోవడంతో శ్రీ రాముడే పెన్నా నదిలోని ఇసుకతో ఒక శివలింగాన్ని తన స్వహస్తాలతో తయారు చేసి ప్రతిష్టించాడు. దీనిని “సైకత లింగంగా” పిలుస్తున్నారు. ఇప్పటికీ కూడా శ్రీరాముని యొక్క వేళి ముద్రలు ఈ శివలింగంపై వున్నాయి. కాశీ నుంచి ఆలస్యంగా తిరిగి వచ్చిన హనుమంతుడు అది చూసి భాధపడ్డాడు. దాంతో శ్రీరాముడు అతడికి సంతోషం కలిగించడానికి “సైకత లింగానికి” కొంత దూరంలో హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని కూడా ప్రతిష్టించాడు ఆ క్షేత్రాన్ని “హనుమత్ లింగేశ్వర క్షేత్రం” అని పిలుస్తారు.  
శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రక్కన శ్రీ రాజరాజేశ్వరీ మరియు శ్రీ ఆదిశంకరాచార్యులు పూజించిన శ్రీ చక్రయంత్రం ఇక్కడ ప్రతిష్టించబడింది. ఇంకా ఈ ఆలయప్రాంగణంలో విఘ్నేశ్వరుడువీరభద్రుడుసుభ్రమణ్యెశ్వర స్వాముల వారు నెలకొనివున్నారు. స్థల పురాణం ప్రకారం శ్రీ రాముడు ఇక్కడ సైకిత లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్టించాడుఅందుకే ఈ ఊరికి “ప్రొద్దుటూరు” అని పేరు వచ్చింది అని ఒక కథనం. ఈ క్షేత్ర ప్రతిష్టతో శ్రీ రాముడు బ్రహ్మహత్యపాతకం నుంచి విముక్తిని పొందాడు అందుకే ఈ క్షేత్రాన్ని “ముక్తి రామేశ్వరం” అని పిలుస్తారు. శాసనాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయలు ఈ ఆలయంలో 5 అంతస్తుల రాజగోపురాన్ని మరియు రక్షణ కోసం ఆలయం చుట్టు ఎత్తైన గోడను నిర్మించారు. అందమైన శిల్పాలతో అలరారే ఈ ముక్తి రామేశ్వర క్షేత్రం చూపరులకు కనువిందు పరుస్తుంది. చైత్ర మాసంలో పౌర్ణమి నుండి పది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక సోమవారాలలో భక్తులు విశేషంగా ఇక్కడికి వస్తారు.

శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం ( శివాలయం ) :

ప్రొద్దటూరు పట్టణం నడిబొడ్డున వెలసిన శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ది చెందింది. పూర్వం అగస్త్య మహాముని ఈ ఆలయంలోని శివలింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగిందిఅందుకే ఈ ఆలయంలోని శివలింగాన్ని అగస్తేశ్వర స్వామిగా పిలుస్తున్నారు. ఈ అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని నంది చోళుడు నిర్మించాడు. 1498లో విజయనగర రాజు ఉమ్మడి నరసింహ రాయల సైన్యాధికారి నరసనాయకుడు ఈ అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఎంతోమంది ఈ ఆలయంలోని స్వామి వారిని దర్శించి తరించారు. 14 భాషలలో నిష్టాతులైన మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ ఆలయంలోనే ఎనలేని కీర్తి ప్రతిష్టను తెచ్చిన “శివ తాండవం” కావ్యాన్ని వ్రాశారు.  ఈ ఆలయానికి ఎతైన ప్రాకారాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో అగస్తేశ్వరుడుశ్రీ రాజరాజేశ్వరీశ్రీ  భీమలింగేశ్వరుడుసుందరేశ్వరుడునవగ్రహ మండపంనాగుల దేవతలుశ్రీ కోదండ రామస్వామి ఆలయాలున్నాయి. అంతరాలయంలో వీర భద్రుడుకార్తికేయుడుగణపతి స్వాములవారు  వున్నారు. ఈ ఆలయంలో స్వామి వారికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి నుంచి పది రోజుల పాటు శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు చాలా అత్యంత వైభవంగా జరుగును. ఈ ఆలయం లోపలికి ప్రవేశించగానే అనిర్వచనీయమైన ఆనందంమనస్సు ప్రశాంత  మరియు మంచి ఆలోచన భావము చేకూరుతుంది.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి దేవస్థానం ( అమ్మవారి శాల ) :

ప్రొద్దటూరు పట్టణ కీర్తికి తలమానికం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయం. క్రీ.శ 1890లో “శ్రీ కామిశెట్టి చిన్న కొండయ్య” ఈ దేవాలయాన్ని స్థాపించారు. ఈయనకు శ్రీ వాసవి దేవి మాత కలలో కనిపించి తన కోసం ఒక ఆలయాన్ని నిర్మించవలసిందిగా ఆదేశించిందటదీంతో ఆయన కొంత మంది సహాయంతో ఈ దేవాలయాన్ని స్థాపించారు. ఈ ఆలయానికి ఎత్తైన గాలిగోపురం వుంది. ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజు అంటే తొట్టి మెరవని నాడు అమ్మవారి ఊరేగింపుకు దాదాపు 2 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. దసరా ఉత్సవాలలో మైసూరు తరువాత ప్రొద్దటూరు అనే చెప్పుకోవచ్చు. దసరా ఉత్సవాల సమయంలో ఈ ప్రొద్దటూరు పట్టణం LED కాంతులతో విరాజిల్లుతూ వుంటుంది. మహాత్మా గాంధీ గారు  1929లో ఈ ఆలయాన్ని దర్శించారు. ఆయన వెళ్ళిన మార్గాన్ని గాంధీ రోడ్డుగా ఇప్పటికీ పిలుస్తున్నారు.  

శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం :

ప్రొద్దటూరుకు కొత్తశోభ పెన్నా నది తీరంలో నిర్మించబడిన అయ్యప్ప స్వామి దేవాలయం. శిల్ప కళా నైపుణ్యంతోనుగాలిగోపురాలతోనూ ఈ దేవాలయంను చూడముచ్చటగా నిర్మించారు. కడప జిల్లాలోని అయ్యప్ప స్వామి దేవాలయాలన్నింటిలో ఈ దేవాలయమే పెద్దది. రాస్ట్రంలోని యాత్రికులు ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకొని శబరిమల యాత్ర చేస్తారు. అయ్యప్ప స్వామి ఆలయానికి పక్కన ఒక పెద్ద శివుని విగ్రహంను నిర్మించారు. ఈ విగ్రహం యొక్క వెనుక భాగంలో ఇరువైపులా రెండు సింహాపు తలలను నిర్మించారుఆ సింహాపు తలల లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారులోపల కొన్ని శివలింగాలను (జ్యోతిర్లింగాలను)మరికొందరి దేవుళ్ళ విగ్రహాలను భక్తులు సందర్శించడానికి ఏర్పాటు చేశారు. చుట్టు ప్రకృతి అందాలతో ఈ ప్రదేశం చాలా అద్బుతంగా వుంటుంది.  

రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు :

అయ్యప్ప స్వామి గుడికి సమీపంలోనే రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు వుంది. దీనిలో 1.5km జాగింగ్ ట్రాక్ వుంది. ఈ పార్కు మొత్తం పచ్చని చెట్లతో నిండి వుండి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక్కడ పిల్లల వినోదం కోసం జారుడుబండలుఊయలలుమొదలైనవి వున్నాయి. ఈ పార్కు మొత్తం కనిపించేలా ఇక్కడ ఒక ఎత్తైన టవర్ను నిర్మించారు. ఇక్కడ ఒక కాంటీన్ కూడా వుంది. వీకెండ్స్ మరియు సాయంకాల సమయంలో ఒక చిన్న పిక్నిక్ లాగా ఇక్కడ ఆనందించవచ్చు.     

గాంధీ పార్కు :

ఈ గాంధీ పార్కు ప్రొద్దటూరు మునిసిపల్ ఆఫీసు సమీపంలో వుంది. ఇక్కడ పిల్లల కోసం ఊయలలుజారుడుబాండలు వున్నాయిమరియు పెద్దలు వ్యాయామం చేసుకోవడానికి కావాలసిన కొన్ని సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేశారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం :

ప్రొద్దటూరుకు 6 km దూరంలో నరసింహాపురం అనే గ్రామం వుంది. దీనిని నరసింహ కొట్టాలు అని కూడా పిలుస్తారు. ఇక్కడ దాదాపు 400 సంవత్సరాల క్రితం నాటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వుంది. మీరు ఈ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.  

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం :

ఈ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రొద్దటూరులోని బొల్లవరం గ్రామంలో వుంది. ఈ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని  దాదాపు 500 సంవత్సారల క్రితం విజయనగర రాజులు నిర్మించారు. సంక్రాంతి పండుగ రోజు మూడు రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చివరి రోజు అయిన కనుమ రోజు ఇక్కడ పార్వేట చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇంకా ఇక్కడ ఆ కాలం నాటి వేణుగోపాల స్వామి ఆలయంఆంజనేయ స్వామి ఆలయంరామాలయాలను సందర్శించవచ్చు.

ఇతర ప్రదేశాలు :

ఇంకా ఈ ప్రొద్దటూరు పట్టణంలో చౌషన్ వలి దర్గాచెన్న కేశవ స్వామి ఆలయంచౌడేశ్వరీ దేవీ ఆలయాలుసాయి బాబా ఆలయాలురెండు కులాయిలు గంగమ్మ తల్లి ఆలయం మొదలైనవి వున్నాయి. ఇంకా ఇక్కడ రాయల్ కౌంటీగోల్డెన్ పార్కు మొదలైన ప్రదేశాలలో స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో వున్నాయి. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.

గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు