kadapa places
ఒంటిమిట్టలో చూడవలసిన ప్రదేశాలు
ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కడప జిల్లాలో వున్న ప్రసిద్ధ
పుణ్యక్షేత్రం. ఈ ఒంటిమిట్ట కడప నుండి 25kmల దూరంలో వుంది. ఇక్కడ అతి ప్రాచీనమైన “శ్రీ కోదండ రామస్వామి ఆలయం” వుంది. ఈ ఆలయంలో శ్రీ సీతారామలక్ష్మణుల
విగ్రహాలు ఏకశిలగా వుంటాయి, అందువల్ల ఈ క్షేత్రమును “ఏక శిలానగరము” అని కూడా
పిలుస్తారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఈ ఆలయం “ఆంద్రా భద్రాచలంగా” పిలువబడుతుంది.
16వ శతాబ్దంలో ఫ్రెంచ్ యాత్రికుడు అయిన “టావెర్నియర్” ఈ ఆలయంను సందర్శించి భారతదేశంలోని అతిపెద్ద గోపురాలు వున్న ఆలయాలలో ఈ రామాలయం కూడా ఒకటి అని కీర్తించాడు. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే ఎందుకంటే శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో శ్రీ సీతారామలక్ష్మణుల ఏకశిలా విగ్రహంను స్థాపించినట్లు కథనం. ఇక్కడ వున్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించారట, ఒకే శిలలో శ్రీ రామున్ని, సీతను మరియు లక్ష్మణుడిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు.
16వ శతాబ్దంలో ఫ్రెంచ్ యాత్రికుడు అయిన “టావెర్నియర్” ఈ ఆలయంను సందర్శించి భారతదేశంలోని అతిపెద్ద గోపురాలు వున్న ఆలయాలలో ఈ రామాలయం కూడా ఒకటి అని కీర్తించాడు. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే ఎందుకంటే శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో శ్రీ సీతారామలక్ష్మణుల ఏకశిలా విగ్రహంను స్థాపించినట్లు కథనం. ఇక్కడ వున్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించారట, ఒకే శిలలో శ్రీ రామున్ని, సీతను మరియు లక్ష్మణుడిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు.
ఒంటిమిట్టలో చూడవలసిన ప్రదేశాలు :
- ఆలయ గోపురాలు
- రంగ మండపం
- శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం
- స్వామి వారి పుష్కరిణి
- శ్రీ రామ తీర్థం
- ఇమాంబేగ్ బావి
- మృకుందాశ్రమం
- ఆంధ్ర వాల్మీకి ఆశ్రమం
ఆలయ గోపురాలు :
ఈ కోదండ రామాలయానికి తూర్పు, ఉత్తర మరియు దక్షిణ దిక్కులలో ఎత్తైన మూడు గోపుర ద్వారాలు వున్నాయి. ఈ గోపురాలు క్రీ.శ 1590 నుండి క్రీ.శ 1628 మధ్య కాలంలో నిర్మాణం అయ్యాయి. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. స్తంభాల మీద ప్రతి అంగుళంలోనూ అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఆలయ ముఖద్వారం యొక్క ఎత్తు సుమారు 160 అడుగులు వుంటుందట, ఈ గోపురాలు చోళ పద్దతిలో నిర్మించబడి ఉన్నాయి.రంగ మండపం :
ఇక్కడి ఆలయప్రాంగణంలో 32 శిలాస్తంభాలతో ఒక రంగ మండపం మరియు మహప్రాకరం వున్నాయి. ఈ రంగ మండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. చోళ, విజయనగర వాస్తుశైలలు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ, భాగవత కథలను చూడవచ్చు. సీతాదేవికి ఆంజనేయ స్వామి అంగులీకమును చూపించు దృశ్యం మరియు ఆంజనేయ స్వామి వారధికి గుండ్రళ్లు వేస్తున్న దృశ్యం మొదలైన అనేక అద్బుతమైన దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం :
ఈ ఒంటిమిట్ట రామాలయంలో ఆంజనేయ స్వామి వారు వుండరు మరియు హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే. అందువల్ల ప్రధాన ఆలయంనకు ఎదురుగా ఆంజనేయ స్వామి వారి ఆలయంను నిర్మించారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని సంజీవరాయ స్వామిగా పూజిస్తున్నారు. ఆంజనేయ స్వామి ఆలయం ప్రక్కన ఒక రథశాల వుంది మరియు వెనుక భాగంలో స్వామి వారి పుష్కరిణీ వుంది.శ్రీ రామ తీర్థం :
ఈ ప్రదేశం రామాలయానికి దక్షిణంగా వున్న ఆంధ్ర వాల్మీకి ఆశ్రమంకు సమీపంలో వుంది. పూర్వం శ్రీ రాముల వారు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించారట, అప్పుడు ఒక రోజున సీతాదేవికి దప్పిక వేసిందట అప్పుడు శ్రీ రాముల వారు ఆమె దప్పికను తీర్చడానికి తన బాణాన్ని ఎక్కుపెట్టి పాతాళగంగను పైకి తెచ్చాడని ఆ నీరు తాగి సీతాదేవి తృప్తి చెందినదిగా ఇక్కడి స్థలపురాణంలో వివరించబడింది. ఆ ప్రదేశమే ప్రస్తుతం “శ్రీ రామ తీర్థం”గా పిలవబడుతున్నది.ఇమాంబేగ్ బావి :
ఒంటిమిట్టలో సందర్శకులను ఆకర్షించే అంశాలలో “ఇమాంబేగ్ బావి” కూడా ఒకటి. క్రీ.శ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన “అబ్దుల్ నబీ ఖాన్” యొక్క ప్రతినిది “ఇమాంబేగ్”. ఈయన ఒక సారి ఈ ఒంటిమిట్ట రామాలయానికి వచ్చిన భక్తులతో మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. అప్పుడు అక్కడి భక్తులు చిత్తశుద్దితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడాని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు శ్రీ రాముల వారిని పిలుస్తారు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ! అని సమాధానం వచ్చింది. దీంతో ఇమాంబేగ్ గారు ఆశ్చర్యపోయారు. తరువాత స్వామికి భక్తుడిగా మారిపోయి ఇక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని త్రవ్వించారు. అందువల్ల ఆయన పేరు మీదగానే ఈ బావిని “ఇమాంబేగ్ బావి”గా పిలుస్తునారు మరియు ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు.మృకుందాశ్రమం :
ఈ ప్రదేశం ఒంటిమిట్టకు పడమర వైపున 1km దూరంలో వుంది. పూర్వం మృకుంద మహర్షి ఈ ఆశ్రమాన్ని నిర్మించారట, ఈయన ఈ ఆశ్రమంలో కొలువై వున్న ముక్కంటిని నిత్యం ఆరాధించేవారని పూర్వీకుల కథనం. ఈ ఆలయానికి సమీపంలో వున్న వంక, దక్షిణం నుండి ఉత్తరం వైపుకు ప్రవహిస్తూ వుంటుంది. అందువల్ల ఈ జలాధారను భక్తులు పవిత్రమైనదిగా భావిస్తున్నారు.ఆంధ్ర
వాల్మీకి ఆశ్రమం :
ఈ ప్రదేశం ఇక్కడి శ్రీ రామ తీర్థంకు సమీపంలో వున్న ఒక పెద్ద గుట్ట పైన
వుంది. ఒంటిమిట్ట నివాసి, “ఆంధ్ర వాల్మీకి” అని పేరుపొందిన “వావిలి కొలను సుబ్బారావు” గారు ఇక్కడి
రామాలయాన్ని పునరుద్ధరించారు. ఈయన టెంకాయ చిప్ప చేత పట్టుకొని భిక్షాటన చేసి, వచ్చిన
సొమ్ముతో సుమారు 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించాడు. ఈయన వాల్మీకి
రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి
మందరం అను పేరుతో వ్యాఖ్యానం కూడా వ్రాశారు. ఈ ఆశ్రమంలో ఈయన యొక్క విగ్రహం వుంది. శ్రీ రామనవమి ఉత్సవాలు :
ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్దనవమి నుండి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చంద్రుని వెలుగుల్లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడి ఆలయ ప్రత్యేకత. ప్రతి ఏటా శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా 9 రోజుల పాటు ఇక్కడ నిర్వహిస్తారు. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం మరియు నవమి నాడు పోతన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు ఎంతో శోభనిస్థాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం చేస్తూంటారు. చాలా మంది భక్తులు కూడా ఆ అన్నదాన కార్యక్రమంనకు వారికి తోచిన సాయం చేస్తూ వుంటారు.ఎలా వెళ్లాలి ?
బస్ సౌకర్యం
: కడప నుండి ఒంటిమిట్టకు ప్రతి రోజు ప్రతి అరగంటకు ఒకసారి RTC బస్సులు అందుబాటులో వుంటాయి. రైల్వే స్టేషన్ : ఒంటిమిట్టలో రైల్వే స్టేషన్ వుంది. ఇది ప్రధాన ఆలయానికి 1 km దూరంలో వుంటుంది.
విమానాశ్రయం : విమానంలో వచ్చే వారి కోసం ఇక్కడి సమీపం లోని కడపలో ఒక విమానాశ్రయం వుంది అయితే ఇది కొత్త విమానాశ్రయం కాబట్టి ఇంకా విమాన సర్వీసులు అంతగా అందుబాటులో లేవు. ఒక వేళ మీరు విమానం లోనే రావాలిసి వుంటే ఇక్కడికి 112 km దూరంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయం వుంది. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.
గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్‌లు