brahmam gari charitra
బ్రహ్మం గారి మఠంలో చూడవలసిన ప్రదేశాలు
శ్రీ
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 1608లో “పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబ” అనే దంపతులకు జన్మించారు. ఇప్పుడు కర్ణాటకలోని పాపాఘ్ని మఠం
బ్రహ్మం గారి మొదటి మఠంగా వెలుగొందుతున్నది. అతి చిన్న వయసులోనే బ్రహ్మం గారు
కాళికాంబపై సప్తశతి రచించి అందరినీ ఆకట్టుకున్నారు. తరువాత బ్రహ్మం గారు తన 15 ఏళ్ల కాలంలో కర్నూలు జిల్లాలోని బనగానపల్లికు వెళ్ళారు. బనగానపల్లెలోని
రవ్వలకొండ గుహలలో కాలజ్ఞానంను రచించారు. తరువాత దేశాటన
చేస్తూ కందిమల్లాయపల్లెకు చేరుకున్నారు, ఇక్కడ నివాసం
ఏర్పరచుకొని మామూలు వడ్రంగిలా జీవించడం మొదలుపెట్టారు. కొంతకాలం తరువాత బ్రహ్మం
గారు కందిమల్లాయపల్లె గ్రామంను విడిచి దేశాటన చేస్తూ పెద్ద కొమ్మర్ల అనే వేరొక
గ్రామాన్ని చేరుకొని, అక్కడ “గోవిందమ్మ”ను వివాహం
చేసుకొని అక్కడ కూడా కొంతకాలం గడిపారు. (ఇక్కడే బ్రహ్మం గారు పత్తిగింజలో వెలిశారు, ఇప్పటికీ కూడా మనం ఆ వింతను పెద్దకొమ్మర్ల గ్రామంలో చూడవచ్చు.) చివరకు
కందిమల్లాయపల్లె గ్రామంలోనే జీవ సమాధి అయ్యారు, ఇప్పుడు
ఆ గ్రామమునే “బ్రహ్మంగారి మఠం”గా పిలుస్తున్నారు.
బ్రహ్మంగారి మఠం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ప్రముఖమైనది. దేశంలోని చాలా రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
బ్రహ్మంగారి మఠం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ప్రముఖమైనది. దేశంలోని చాలా రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
బ్రహ్మంగారి మఠం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ప్రముఖమైనది. దేశంలోని చాలా రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
బ్రహ్మంగారి మఠం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ప్రముఖమైనది. దేశంలోని చాలా రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
బ్రహ్మం గారి మఠంలో చూడవలసిన ప్రదేశాలు :
- ఈశ్వరీ దేవీ మఠం
- బ్రహ్మం గారి జీవ సమాధి
- బ్రహ్మం గారు నివసించిన ఇల్లు
- వీర బ్రహ్మేంద్ర పార్క్
- కక్కయ్య స్వామీ మఠం
- పోలేరమ్మ నిప్పు తెచ్చిన ప్రదేశం
- శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం
- పోలేరమ్మ గుడి
- నవరత్న మండపం
- బ్రహ్మం సాగర్
- ఈశ్వరి దేవీ గుహ మొదలైనవి
ఈశ్వరి దేవీ మఠం :
ఈశ్వరి దేవీ మఠం బ్రహ్మంగారి మఠంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ శ్రీ ఈశ్వరి దేవీ గారు జీవ సమాధి అయ్యారు, ఇంతకు ఈ ఈశ్వరి దేవీ గారు ఎవరో తెలుసా? కంగారూ పడకండి ఇప్పుడు ఆమె చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం.ఈశ్వరి దేవీ చరిత్ర :
ఈశ్వరి దేవీ గారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మనవరాలు మరియు బ్రహ్మం గారి పెద్ద కుమారుడు అయిన గోవింద స్వామి వారి కుమార్తె. ఈమె క్రీ.శ. 1703లో జన్మించారు. బ్రహ్మం గారి లాగానే ఈమె కూడా కాలజ్ఞానంను రచించారు, ఈమె వినుకొండ గ్రామంలో నీటితో దీపాలు వెలిగించడం వంటి అద్భుతాలు చేశారు మరియు గుడుగునురు మూగసుబ్బయ్య కంఠం నుండి మధుర సన్నాయి స్వరాలు పలికించారు. ఈమె బ్రహ్మంగారి మఠంకు సమీపాన ఉన్న కొండ గుహయందు యోగనిష్టతో తపస్సు చేసి అష్టాంగయోగాది వాక్సిద్దిని పొందారు. పరిసమాప్తిలేని అవతార మూర్తినంటూ క్రీ.శ 1789లో సజీవ సమాధి నిష్టవహించారు. ఇప్పుడు ఆమె జీవ సమాధి అయిన ప్రదేశం ఈశ్వరి దేవీ మఠంగా వెలుగొందుతున్నది మరియు ఆమె తపస్సు చేసిన గుహ ఈశ్వరి దేవీ గుహగా పిలువబడుతున్నది.ఈశ్వరి దేవీ గుహ :
ఈశ్వరి దేవీ గుహ బ్రహ్మంగారి మఠం నుండి 3km దూరంలో ఉంది. ఇది బ్రహ్మంగారి మఠంనకు వెళ్ళే మార్గంలోనే వస్తుంది. ఇక్కడ దిగగానే మనకు అన్నదాన సత్రం కనిపిస్తుంది. అక్కడ భోజనం చేసిన తర్వాత పక్కనే కొండమీదకు దారి వుంటుంది ఐతే సగం దూరం వరకు బైకులో వెళ్లొచ్చు, తరువాత మనకు కొండమీదకు మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్లు దాదాపు 100 - 200 వరకు వుంటాయి, పైకి ఎక్కిన తరువాత మనకు కొండ లోపలికి ఒక గుహ కనిపిస్తుంది, లోపలికి దాదాపు 100m వెళ్ళవలసి ఉంటుంది. లోపల లైట్స్ సౌకర్యం కూడా కలదు. శ్రీ ఈశ్వరి దేవీ అమ్మవారు ఇక్కడ 14 యేళ్లు తపస్సు చేశారు. ఈ గుహ లోపలి నుండే తిరుపతికి మరియు యాగంటికి సొరంగ మార్గాలు వున్నాయి.బ్రహ్మం గారి జీవ సమాధి ( బ్రహ్మం గారి మఠం ) :
బ్రహ్మం గారు ఒక రోజు తన కుటుంబ సభ్యులను, శిష్యులను సమావేశపరిచి కొద్ది రోజులలో తాను సమాధిలోకి ప్రవేశించబోతున్నట్లు, తన తరువాత తన కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. శిష్యుడైన సిద్ధయ్యకు విశ్వఖ్యాతి కల్పించాలని, సిద్దయ్యను పూలు తీసుకురమ్మని అరణ్యానికి పంపి బ్రహ్మం గారు సమాధిలోకి వెళ్ళారు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విలిపించసాగాడు. అప్పుడు బ్రహ్మం గారు శిష్యునిపై కరుణించి, సమాధి పైన వున్న రాతిని తొలగించమని ఆదేశించి, రాతిని తొలగించిన తరువాత స్వామి వారు బయటకు వచ్చి సిద్దయ్యను ఓదార్చారు. బ్రహ్మం గారు సజీవ సమాధి అయిన ప్రదేశం ఇప్పుడు బ్రహ్మం గారి మఠంగా పేరొందింది.బ్రహ్మం గారు నివసించిన ఇల్లు :
బ్రహ్మం గారు దేశాటన చేస్తూ కందిమల్లాయపల్లెకు చేరుకున్నారు. ఇక్కడ నివాసం ఏర్పరచుకొని మామూలు వడ్రంగిలా జీవించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా ఆయన నివసించిన ఇల్లు అలాగే కందిమల్లాయపల్లె అనగా బ్రహ్మం గారి మఠంలో వుంది మరియు తన నీటి అవసరాలు తీర్చుకోవడానకి రాత్రికి రాత్రే తన నివాసంలో జింక కొమ్ముతో బావిని కూడా త్రవ్వుకున్నారు, దీనిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు.వీర బ్రహ్మేంద్ర పార్క్ :
వీర బ్రహ్మేంద్ర పార్క్ బ్రహ్మం గారి మఠంలోని చూడవలసిన ప్రదేశాలలో ఒకటి ఇది మఠంకు సమీపంలో 100m దూరంలో ఉంది.కక్కయ్య స్వామీ మఠం :
బ్రహం గారు తన శిష్యుడు సిద్ధయ్యకు యోగవిద్య, కుండలినీశక్తి, శరీరంలోని యోగ చక్రాలు గురించి వివరిస్తూ, శరీరం ఒక దేవాలయమనీ అందులో దేవతలుంటారని కుండలినీశక్తిని జాగృతం చేయడం ద్వారా వీరిని దర్శించవచ్చని వివరిస్తుండగా కక్కయ్య అను వ్యకి ఇదంతా విన్నాడు. బ్రహ్మం గారి మాటలు నమ్మి కక్కయ్య దానిని పరీక్షించాలనుకొని తన భార్యను నరికివేస్తాడు, దాంతో ఆమె చనిపోతుంది. దీనికి అంతా బ్రహ్మం గారు కారణమని, బ్రహ్మం గారు ఒక దొంగ అని కక్కయ్య దూషించడం మొదలుపెట్టాడు.అప్పుడు బ్రహ్మం గారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే కక్కా! నేను చెప్పింది అసత్యం కాదు
అప్పుడు బ్రహ్మం గారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే కక్కా! నేను చెప్పింది అసత్యం కాదు, నిదర్శనంగా నీ భార్యను బ్రతికిస్తాను అని చెప్పి, అతని భార్య శరీరంపై మంత్రజలం చల్లగానే ఆమె నిద్ర నుండి మేల్కొనినట్టుగా లేచి కూర్చుంది. అప్పటి నుండి కక్కయ్య బ్రహ్మం గారికి శిష్యుడుగా మారతాడు. ఇప్పుడు మనం కక్కయ్య స్వామి మఠంను బ్రహ్మం గారి మఠంలో చూడవచ్చు ఇది బ్రహ్మం గారి మఠం నుండి 1km దూరంలో ఉంది.
పోలేరమ్మ నిప్పు తెచ్చిన ప్రదేశం :
ఒకరోజు గ్రామంలో అమ్మవారి జాతర కొరకు చెందా ఇవ్వమని గ్రామ పెద్దలు కోరగా బ్రహ్మం గారు తను ఒక పేదవాడినని ఏమి ఇవ్వలేనని బదులిచ్చారు. ఆ సమయంలోనే గ్రామ పెద్ద చుట్ట కాల్చుకోవడానికి చూస్తుండగా బ్రహ్మం గారు అమ్మవారిని ఉద్దేశించి పోలేరీ చుట్టకు నిప్పు పట్టుకునిరా అని కోరగానే అదృశ్యరూపంలో అమ్మవారు అతనికి నిప్పు అందించగా ఊరివారు దిగ్భ్రాంతి చెంది అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా పోలేరమ్మ నిప్పు తెచ్చిన ప్రదేశమును ఇక్కడ చూడవచ్చు.పోలేరమ్మ గుడి మరియు ఆంజనేయ స్వామి ఆలయం :
ఈ రెండు ఆలయాలు బ్రహ్మం గారి మఠం నుండి 2km దూరంలో వున్నాయి. మీరు వీటిని కూడా సందర్శించవచ్చు. పోలేరమ్మ గుడి దగ్గర వాతావరణం చాలా ప్రశాంతంగా వుంటుంది, ఎక్కువగా ఆదివారం నాడు ఇక్కడికి భక్తులు వస్తుంటారు.నవరత్న మండపం :
ఇక్కడ మనం ఒకే ప్రదేశంలో 9 ఆలయాలను సందర్శించుకోవచ్చు అందువలన దీనిని నవరత్న మండపం అని పిలుస్తున్నారు.1. గణపతి ఆలయం
2. విష్ణు ఆలయం
3. సంతాన వేణుగోపాల స్వామి ఆలయం
4. బ్రహ్మ ఆలయం
5. సనారి విశ్వేశ్వర ఆలయం
6. ఇంద్ర ఆలయం
7. సూర్య ఆలయం
8. గౌరీ చంద్రశేఖర ఆలయం
9. గాయత్రి విశ్వకర్మ ఆలయం
బ్రహ్మం సాగర్ :
బ్రహ్మం సాగర్ రిజ్వాయర్ కడప జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. బ్రహ్మం గారి మఠం సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు ఈ అందమైన ప్రదేశాన్ని తప్పకుండా సందర్శిస్తారు. చల్లని వాతావరణం మరియు ప్రకృతి అందాలతో, బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్ పర్యాటకులను ఆకర్షిస్తుంది, ఇక్కడ మనం బ్రహ్మం సాగర్ పార్కును కూడా చూడవచ్చు. ఈ “బ్రహ్మం సాగర్”లో బోటింగ్ సదుపాయం కూడా అందుబాటులో వుంది పర్యాటకులు ఈ బోటింగ్ వలన మరింత ఆనందాన్ని పొందవచ్చు.ఎలా చేరుకోవాలి ?
రోడ్డు మార్గం : బ్రహ్మం గారి మఠం చేరుకోవడానికి కడప, మైదుకూరు, బద్వేలు నుండి బస్సులు అందుబాటులో వున్నాయి.రైలు మార్గం : ఈ ప్రదేశానికి దగ్గరలో వున్న రైల్వే స్టేషన్లు కడప, నెల్లూరు, అనంతపురం.
విమానాశ్రయాలు : తిరుపతి మరియు కడప. ఇంకా మీకు ఏదైనా సమాచారం కావలసివుంటే క్రింద కామెంట్ చేయండి.
గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !
రైలు మార్గం : ఈ ప్రదేశానికి దగ్గరలో వున్న రైల్వే స్టేషన్లు కడప, నెల్లూరు, అనంతపురం.
విమానాశ్రయాలు :
విమానాశ్రయాలు : తిరుపతి మరియు కడప. ఇంకా మీకు ఏదైనా సమాచారం కావలసివుంటే క్రింద కామెంట్ చేయండి.
గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్‌లు