belum caves
బెలుం గుహలలో చూడవలసిన ప్రదేశాలు
బెలుం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో వున్న
“ బెలూం ” గ్రామ సమీపంలో భూమి లోపల అడుగు భాగాన వున్నాయి. భారతదేశంలోని మేఘాలయలో
వున్న “ క్రిం లియోట్ ప్రా ” గుహల తరువాత రెండవ
అతి పెద్ద గుహలుగా ఈ బెలుం గుహలు ప్రసిద్ధికెక్కాయి. పురాతన కాలంలో అత్యంత సహజ
సిద్దంగా ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం.
పొడువైన సొరంగ మార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల యొక్క ప్రత్యేకత. బెలూం
గుహలు దాదాపు 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని అని నిపుణుల అభిప్రాయం. 1884లో
మొదటి సారిగా “ రాబర్ట్ బ్రూస్ పూట్ ” అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికి గురించి
ప్రస్తావించాడు. 1982లో “ డేనియల్ గెబోర్ ” నాయకత్వంలో జర్మన్ నిపుణుల బృందం ఈ
గుహలను సందర్శించి, పరిశీలించింది. బెలూం గుహల ఉనికి
గురించి ఈ బృందం ద్వారానే బయట ప్రపంచానికి ప్రముఖంగా తెలిసిందని చెప్పవచ్చు.
ఇందుకు గుర్తుగా ఇక్కడి ప్రవేశ ద్వారాన్ని “ గేబర్ హాల్ ” అని పిలుస్తున్నారు. ఈ
గుహలు భూగర్భంలో దాదాపు 10 km విస్తరించి ఉన్నాయని కనిపెట్టారు. 2002 ఫిబ్రవరిలో బెలూం గుహలను
సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ
వారు ఈ గుహలను తమ ఆధీనంలోకి తెసుకొని, పర్యాటకుల కోసం 2 km వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి
అనుకూలంగా దారిని నిర్మించారు. సహజత్వానికి లోపం రాకుండా బెలూం గుహల అందాలు
ద్విగుణీకృతమయ్యే విధంగా విద్యుత్ దీపాలను అమర్చారు. గుహల లోపల పర్యాటకులు
ఆక్సీజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపలికి గాలిని పంపే ఆక్సీజన్ బ్లోయర్లను
ఏర్పాటు చేశారు. ఈ గుహాల్లొకి వెళ్ళే దారి ఒక బిలం లాగా వుంటుంది. అందువల్ల వీటిని
“ బిలం గుహలు ” అని పిలిచేవారు. కాలక్రమేణా అది “ బెలూం గుహలు ”గా మారింది.
బెలూం గుహలు విశాఖపట్నం జిల్లాలోని “ బొర్రా గుహల ” కంటే పొడవైనవి. గుహల పైకప్పు నుంచి కిందకి వేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులను “ స్టాలక్ టైట్ ” లని, కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనబడే ఆకృతులను “ స్టాలక్ మైట్ ” లని అంటారు. వాటి రకరకాల ఆకరాలను బట్టి స్థానికులు వీటికి కోటి లింగాలు, మండపం, ఊడల మర్రి, పాతాళ గంగ వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. ఈ గుహలను పూర్తిగా తిరిగి రావడానికి దాదాపుగా 1 – 2 గంటల సమయం పడుతుంది. మరియు ఈ గుహలు ఉదయం 10 గంటల నుండి సాయత్రం 5 గంటల వరకు పర్యాటకుల కోసం తెరిచే వుంటాయి. ఇప్పుడు మనం ఈ బెలూం గుహలలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
బెలూం గుహలు విశాఖపట్నం జిల్లాలోని “ బొర్రా గుహల ” కంటే పొడవైనవి. గుహల పైకప్పు నుంచి కిందకి వేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులను “ స్టాలక్ టైట్ ” లని, కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనబడే ఆకృతులను “ స్టాలక్ మైట్ ” లని అంటారు. వాటి రకరకాల ఆకరాలను బట్టి స్థానికులు వీటికి కోటి లింగాలు, మండపం, ఊడల మర్రి, పాతాళ గంగ వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. ఈ గుహలను పూర్తిగా తిరిగి రావడానికి దాదాపుగా 1 – 2 గంటల సమయం పడుతుంది. మరియు ఈ గుహలు ఉదయం 10 గంటల నుండి సాయత్రం 5 గంటల వరకు పర్యాటకుల కోసం తెరిచే వుంటాయి. ఇప్పుడు మనం ఈ బెలూం గుహలలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
బెలూం గుహలలో చూడవలసిన ప్రదేశాలు :
- బుద్ధ విగ్రహం
- గేబర్ హాల్
- ధ్యాన మందిరం
- వెయ్యి పడగలు
- ఊడల మర్రి
- మాయా మందిరం
- మండపం
- కోటి లింగాలు
- పాతాళ గంగ మొదలైనవి
బుద్ధ విగ్రహం :
బెలూం గుహలకు వెళ్ళిన వెంటనే ముందుగా మనకు ఒక కొండ దగ్గర పెద్ద బుద్ధ విగ్రహం స్వాగతం పలుకుతుంది. బెలూం గుహల సమీపంలో కొన్ని ప్రత్యేకమైన బౌద్ధ మరియు జైన అవశేషాలు కనుగొనబడ్డాయి. అందుకు గుర్తుగా APTDC వారు ఇక్కడ ఒక కొండ దగ్గర ఒక పెద్ద బుద్ధ విగ్రహంను నిర్మించారు. ఈ విగ్రహం దాదాపుగా 40 అడుగుల ఎత్తు వుంటుంది. ఈ బుద్ధ విగ్రహాన్ని ఈ బెలూం గుహలకు ఒక ప్రత్యేక చిహ్నంగా చెప్పుకోవచ్చు.గేబర్ హాల్ :
మీరు ఇక్కడి ప్రవేశ ద్వారం లోని మెట్లు దిగి లోపలికి వెళ్లిన వెంటనే పైన ఓపెన్ గా వుండి ఒక పెద్ద హాల్ వుంటుంది. దీనినే “ గేబర్ హాల్ ” అంటారు. 1982 – 83 కాలంలో ఈ బెలూం గుహలను అన్వేషించి మరియు మ్యాప్ చేసిన జర్మన్ స్పెలియాలజిస్టు “ Mr. H డేనియల్ గేబర్” ఆయనకు గుర్తుగా ఈ బెలూం గుహల యొక్క ప్రవేశ ద్వారం లోని ఒక భాగాన్ని “గేబర్ హాల్” అని పిలుస్తున్నారు.ధ్యాన మందిరం :
ఈ ధ్యాన మందిరం ప్రవేశ ద్వారానికి దగ్గరలో వుంటుంది. ఈ నిర్మాణం ఒక దిండుతో కూడిన మంచం లాగా వుంటుంది. స్థానిక కథల ప్రకారం పూర్వం ఇక్కడ చాలా మంది ఋషులు మరియు బౌద్ధ సన్యాసులు తపస్సు ( ధ్యానం ) చేసుకుంటూ, నివసిస్తూ వుండేవారట. అందువల్లనే దీనిని ధ్యాన మందిరం అని పిలుస్తున్నారు. ఇక్కడ బౌద్ధుల కాలంనాటి అవశేషాలు లభించాయి, ఈ అవశేషాలను ప్రస్తుతం అనంతపురం మ్యూజియంలో భద్రపరిచారు.వెయ్యి పడగలు :
మనం ముందుగా చెప్పుకున్నట్టు గుహల పైకప్పు నుంచి కిందకి వేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులను “ స్టాలక్ టైట్ ” లని పిలుస్తారు. అయితే ఈ విభాగంలో “ హూబ్రా ఆఫ్ కోబ్రా ” అనే ఆకారంలో అద్బుతమైన “ స్టాలక్ టైట్ ” నిర్మాణాలు వున్నాయి. ఈ “ స్టాలక్ టైట్ ” నిర్మాణాలు గుహ యొక్క పైకప్పు నుండి వేలాది పాములు తమ పడగలు తెరిచినట్లుగా కనిపిస్తాయి. అందువల్ల దీనిని “ వెయ్యి పడగల ” విభాగం అని పిలుస్తున్నారు.ఊడల మర్రి :
ఈ ఊడల మర్రి విభాగంలో గుహ పైకప్పు నుండి వేలాడుతున్న “ స్టాలక్ టైట్ ” నిర్మాణంతో కూడిన ఒక భారీ స్తంభం వుంది. ఈ స్తంభంను దిగువ నుండి చూసినప్పుడు ఒక మర్రి చెట్టు (ఊడల మర్రి) లాగా కనిపిస్తుంది. మరియు ఇక్కడి “ స్టాలక్ టైట్ ” నిర్మాణాలు ఊడల వలె వుంటాయి. అందువల్ల స్థానికులు ఈ ప్రాంతాన్ని “ ఊడల మర్రి ” అని పిలుస్తున్నారు.మాయా మందిరం :
బెలూం గుహలలో చూడవలసిన వాటిలో ఇది ఒక ప్రత్యేక ప్రదేశం. దీని గురించి చెప్పాలంటే ముందుగా మీరు స్వయంగా బెలూం గుహలు వెళ్ళి ఈ మాయా మందిరమను చూస్తే అప్పుడు మీరే అంటారు ఇది ఒక “ మాయా మందిరం ” అని. ఎందుకంటే ఈ ప్రదేశం మీకు ఆ అనుభూతిని కలిగిస్తుంది. ఏదైనప్పటికి ఈ ప్రదేశం విశాలంగా వుండి, గుహలో పైన మరియు చుట్టు పక్కల రకరకాల ఆకారాలతో గీతలు వుండి పర్యాటకులను ఆకట్టుకుంటుంది.మండపం :
ఈ గుహల లోని ప్రదేశాలన్నింటిలో ఇది ఒక పెద్ద ప్రాంతం. ఇక్కడ అద్బుతమైన “ స్టాలక్ టైట్ ” నిర్మాణాలు వున్నాయి, అవి స్తంభాలతో కూడిన ఒక పెద్ద హాల్ లాగా కనిపిస్తాయి. అందువల్ల దీనిని “ మండపం ” అని పిలుస్తున్నారు.కోటి లింగాలు :
ఈ విభాగంలో “ స్టాలక్ టైట్ ” మరియు “ స్టాలక్ మైట్ ” నిర్మాణాలు అచ్చంగా శివలింగాలను పోలి వుంటాయి. ఇవి చాలా వరకు ఇలానే ( శివలింగాల వలె ) వుంటూ అవి అనేకంగా వుంటాయి. అందువల్ల వీటిని “ కోటి లింగాలు ” అని పిలుస్తున్నారు.పాతాళ గంగ :
బెలూం గుహలలో వున్న ఈ పాతాళ గంగ ప్రదేశంలో సహజ సిద్ధంగా ఒక జలపాతం ప్రవహిస్తూ వుంటుంది. ఈ జలపాతం అక్కడే స్వయంభూగా వెలిసిన శివలింగం మీద పడుతూ భూమి యొక్క అడుగు లోపలికి వెళ్ళి కనుమరుగు అవుతుంది. ఈ గుహల లోని ప్రదేశాలన్నింటిలో ఈ ప్రదేశం చాలా అద్భుతంగా వుంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఇక్కడి శివలింగం పర్యాటకులను భక్తి భావంతో ముంచుతుంది. ఇక్కడ జలపాతం భూమి కింద ( పాతాళంలో ) ప్రవహిస్తూ వుంటుంది అందువల్ల దీనిని “ పాతాళ గంగ ” అని పిలుస్తున్నారు.ప్రవేశ ద్వారం :
ఇక్కడి ప్రదేశాలను చూడటానికి వెళ్లాలంటే ఈ ద్వారం ( బిలం ) నుండే వెళ్ళాలి. ఈ బిలం చుట్టు అందమైన రాళ్ళను వృత్తాకారంలో అమర్చారు, అది చూడటానికి చాలా బాగా వుంటుంది. ఈ బిలం నుండి గుహల లోకి వెళ్లేందుకు మెట్లు ( steps ) ను నిర్మించారు. ఈ ప్రవేశ ద్వారానికి బయట ఎదురుగా ఒక చిన్న పార్కు కూడా వుంటుంది అందులో పిల్లలు ఎంచక్కా ఆడుకోవచ్చు.ఇతర ప్రదేశాలు :
బెలూం గుహలు సందర్శించాక సమీపం లోని కొలిమిగుండ్లలో వన్న “ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ”ను కూడా సందర్శించండి. ఈ ఆలయం మొత్తం పాలరాతితో నిర్మించబడి వుంటుంది. అంతే కాకుండా మీరు సమీపం లోని యాగంటి, బుగ్గ క్షేత్రాలను కూడా సందర్శించవచ్చు. ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలలో గండికోట కూడా ఒకటి. వీటికి సంబంధించిన వివరాలు కూడా మన బ్లాగ్ లో అందుబాటులో వున్నాయి ఒకసారి అవి కూడా చదవండి.ఎలా చేరుకోవాలి ?
రోడ్డు మార్గం : బెలూం గుహలు చేరుకోవాలి అంటే కర్నూల్, నంద్యాల మీదుగా లేదా అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా లేదా కడప జిల్లా జమ్మలమడుగు మీదుగా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు.రైలు మార్గం : రైలు మార్గం ద్వారా చాలా రైళ్లు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడి తాడిపత్రి రైల్వే స్టేషన్ లో ఆగుతాయి. అయితే తాడిపత్రి రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బెలూం గుహలను చేరుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.
గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్‌లు