మైలవరంలో చూడవలసిన ప్రదేశాలు

ఈ రోజు మన ఆర్టికల్లో ఆంధ్రప్రదేశ్ రాస్ట్రంలోని కడప జిల్లాలో వున్న మైలవరంలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. నేను ఇంతకు ముందు గండికోటలో చూడవలసిన ప్రదేశాలు అని ఒక ఆర్టికల్ రాశానుఅందులో గండికోటకు చుట్టు పక్కల చాలా చూడవలసిన ప్రదేశాలు వున్నాయి అని చెప్పాను. అందులో భాగమే ఈ ఆర్టికల్. మైలవరం జమ్మలమడుగు నుండి 8 km మరియు గండికోట నుండి 10 km దూరంలో వుంది.

మైలవరంలో చూడవలసిన ప్రదేశాలు :

  • మైలవరం డ్యామ్ ( రిజర్వాయర్ ) 
  • మైలవరం పురాతన వస్తు ప్రదర్శనశాల ( మ్యూజియం ) 
  • శ్రీ గురప్ప స్వామి కోన
  • శ్రీ అగస్తేశ్వర స్వామి కోన 
  • హజరత్ పీర్ గైబుసా వలి దర్గా ( గైబూసా పహాడ్ )

మైలవరం డ్యామ్ ( రిజర్వాయర్ ) :

గండికోటను దర్శించినవారు తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో మైలవరం జలాశయం కూడా ఒకటి. గండికోట నుండి 10 km దూరంలో ఈ మైలవరం డ్యామ్ ఉంది. 1971లో దీనిని 75 వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా నిర్మించారుదీని స్థూల నిల్వ సామర్ధ్యం 9.960 TMC. ఇది కడప జిల్లాలోని మైలవరం సమీపంలో పెన్నా నదికి అడ్డంగా నిర్మించిన మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టు. పెన్నా నదిపై వున్న అందమైన జలాశయాలలో ఇది కూడా ఒకటి. దీనికి మొత్తం 13 గేట్లు వున్నాయి. 1981 - 82 చివరి కాలం నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం మరియు కాలువల నిర్మాణం పూర్తయ్యాయి. మరియు పంపిణీ వ్యవస్థ 1985 - 86 నాటికి పూర్తయింది. ఈ ఆనకట్ట దృశ్యం చాలా అద్భుతమైనది మరియు సమీపంలో ఒక మ్యూజియం కూడా చూడవచ్చుసాయంత్రం సమయంలో సందర్శించడానికి ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం. మీరు అద్భుతమైన సూర్యాస్తమయాన్ని ఇక్కడ చూడవచ్చు. పర్యాటకులను ఆకర్షించడానికి ఇటీవల ఏపి టూరిజం వారు మైలవరం డ్యాం యొక్క బ్యాక్ వాటర్లో “బోట్ క్లబ్” ( బొటింగ్ ) ఏర్పాటుచేశారు. పర్యాటకులు స్పీడ్ బోట్కయాకింగ్ వంటి వివిధ వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పాల్గొనవచ్చు.

మైలవరం పురాతన వస్తు ప్రదర్శనశాల ( మ్యూజియం ) :

మైలవరంలోని ఈ మ్యూజియం ప్రాచీన శిల్పసంపదకుకళా నైపుణ్యానికి అద్దం పడుతూ పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తున్నది. మైలవరం జలాశయం అతిథి గృహం ఆవరణలో మొదటగా ఈ మ్యూజియం దర్శనమిస్తుందిమైలవరంలో జలాశయం నిర్మాణం పూర్తి అయిన తరువాతఅపట్లో గండికోట చుట్టుప్రక్కల ప్రాంతాలలో బయటపడిన అతి పురాతన వస్తు సామాగ్రిని ఇక్కడ భద్రపరిచారు. 12వ శతాబ్దానికి చెందిన నాణేలు, 16వ శతాబ్దానికి చెందిన ఆయుధ సామాగ్రి ఇక్కడ వుంది. మ్యూజియం పరిసర ప్రాంతాలలో పలురకాల ఆకృతులలో కూడిన శిల్పసముదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న పార్కు కూడా వుంది అందులో పిల్లలు బాగా ఆడుకోవచ్చు.

శ్రీ గుర్రప్ప స్వామి కోన :

ఈ గుర్రప్ప స్వామి కోన జమ్మలమడుగు నుండి 16 కిలో మీటర్లు మరియు మైలవరం నుండి 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ గుర్రప్ప స్వామి కోనను దర్శించుకొనుటకు కర్ణాటకఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ప్రతి సోమవారం ఇక్కడ స్వామి వారిని దర్శించుకొనుటకు చాలా మంది భక్తులు వస్తుంటారుఆ రోజు ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి ప్రతి రోజు కూడా పూజాకార్యక్రమాలు జరుపుతుంటారు.
ఇక్కడ భక్తులు విశ్రాంతి తీసుకొనుటకు గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది
కానీ సోమవారం మరియు కొన్ని ముఖ్యమైన  రోజులలో మాత్రమే ఇక్కడ విశ్రాంతి గదులు మరియు దుకాణాలు తెరవబడి ఉంటాయి. గుడికి వెనుక భాగాన మనకు ఒక చెరువు దర్శనమిస్తుంది. దానిని “తురకల చెరువు” అని పిలుస్తారు. ఈ చెరువులోని నీరే ఇక్కడ అద్బుతమైన జలపాతాల దృశ్యాలను కలిగిస్తుంది. గంగమ్మ తల్లి ఆలయంనవగ్రహముల నక్షత్ర వనముఫక్షన్ హలుపెద్ద బావిఅన్నదాన సత్రం మొదలగునవి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పిల్లల వినోదం కోసం ఒక చిన్న పార్కు కూడా వుందిఅందులో ఊయలలుజారుడుబండలు మొదలైనవి వున్నాయి. ఇక్కడ జలపాతాల అందాలు చూడాలంటే నవంబర్ మరియు డిశెంబర్ మాసాలలో ( వర్షాకాలంలో ) రావలసి ఉంటుంది. గుడికి ఎడమ భాగాన ఈ జలపాతం మనకు కనిపిస్తుంది. ఇక్కడ వెలసిన గుర్రప్ప స్వామి వారికి గుడి పైకప్పు నిర్మించడం కష్టమని ఇక్కడి వారు అంటుంటారు. ఇక్కడి నుండే “శ్రీ అగస్తేశ్వర స్వామి కోన”కు వెళ్ళే మార్గం వుంటుంది. ఈ గురప్ప స్వామి కోన నుండి శ్రీ అగస్తేశ్వర స్వామి కోన దాదాపు 2 km దూరంలో వుంది.

శ్రీ అగస్తేశ్వర స్వామి కోన :

మైలవరం మండల కేంద్రానికి 10 km దూరంలో సుందరమైన కోనలువాగులువంకలుపచ్చిక బయళ్ళుప్రకృతి సిద్ధమైన కొండల మధ్యన ఈ “అగస్తేశ్వర స్వామి కోన” ఉంది. త్రేతాయుగంలో “అగస్త్య మహర్షి” దేశ సంచారం చేస్తూ మార్గం మధ్యలో అనేక చోట్ల శివలింగాలను ప్రతిష్టించారు. అలా ఆయన ఈ  అగస్తేశ్వర స్వామి కోనలో అడుగు పెట్టినారు. ఇక్కడే మనోసిద్ధీ కోసం ఆయన ధర్మపత్ని “లోపాముద్ర”తో కలిసి పరమేశ్వర అనుగ్రహానికై శ్రీ దుర్గాసుబ్రమణ్యేశ్వర స్వాముల విగ్రహాలను ప్రతిష్ఠించిఘోర తపస్సు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలియుచున్నది. ఈ కోనలో స్వయంసిద్ధిగా పుట్టిన పిల్ల కాలువలో స్నానమాచరించి జపం చేసే వారని స్థలపురాణాల ద్వారా తెలుస్తున్నది. ఎందరో అనారోగ్య పీడితులు ఈ కొలనులో స్నానమాచరించి స్వస్థత పొందినట్లు స్థానికులు కథలు కథలుగా చెప్పుకోవడం విశేషం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం “మహా శివరాత్రి” పర్వదినం సందర్భంగా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఈ జిల్లా నుండియేకాక చుట్టు ప్రక్కల జిల్లాల నుండి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడికి వచ్చు భక్తుల కోసం RTC వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేస్తారు. మహా శివరాత్రి నాడు ఇక్కడకు భక్తులు అసంఖ్యాకంగా విచ్చేసి శ్రీ అగస్తేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఈ అగస్తేశ్వర స్వామి కోన సమీప పట్టణమైన జమ్మలమడుగు నుండి 18 కిలో మీటర్లుమైలవరం నుండి 10 కిలో మీటర్లు మరియు గుర్రప్ప స్వామి కోన నుండి 2 కిలో మీటర్ల దూరంలో వుంది. ఇక్కడకు చేరుకోగానే ఒక పెద్ద శివుని విగ్రహం దర్శనమిస్తుంది. అక్కడి నుండి లోయ యొక్క దృశ్యాలు చాలా అద్బుతంగా వుంటాయి మరియు అక్కడి నుండి గండికోట కూడా బాగా కనబడుతుంది ఎందుకంటే ఈ అగస్తేశ్వర స్వామి కోన గండికోటకు వెనుక భాగంలో వుంటుంది. ఇక్కడి లోయ ప్రాంతంలో ఒక జలపాతం మరియు ఇక్కడి ఆలయం పక్కన ఒక జలపాతం మనకు దర్శనమిస్తాయిఅయితే ఇవి కేవలం వర్షాకాలంలో మాత్రమే దర్శనమిస్తాయి. స్వామి వారిని దర్శించిన తరువాత ఆలయానికి సమీపంలోనే శ్రీ దత్త పీటం వుంది అక్కడకు వెళ్ళే మార్గంలో ఒక చాలా పెద్ద చెట్టు వుంటుందిదానికి ఎదురుగా కొన్ని ఆలయాలు వుంటాయి వాటిని కూడా దర్శించండి. ఇక మనం ప్రధాన ఆలయం వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రశాంత వాతావరణం మనల్ని మంత్రముగ్ధులని చేస్తుంది. ఆలయం లోపల ఈశ్వరుడు అతి పెద్ద లింగ రూపంలో దర్శనమిస్తారు. ఇంకా అక్కడి కొండ ప్రాంతంలో మునులు తపస్సు చేసిన గుహలు కూడా వున్నాయి.    

హజరత్ పీర్ గైబూసా వలి దర్గా ( గైబూసా పహాడ్ ) :

ఇది మైలవరం నుండి 6 కిలో మీటర్లుజమ్మలమడుగు నుండి 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దర్గా ఒక పెద్ద గుట్ట పైన వుంది. ఈ స్వామి వారి దర్గాను దర్శించుకొనుటకు చాలా మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారుఈ దర్గా ఎతైన కొండ ( పెద్ద గుట్ట ) మీద నిర్మించడం జరిగింది కొండ పైనుండి చుట్టు వుండే దృశ్యాలు చాలా అద్భుతంగా వుంటాయి. దర్గాకు ఎదురుగా దిగువ భాగాన మైలవరం జలాశయం వుంది. కుడి భాగాన శ్రీ గుర్రప్ప స్వామి కోన మరియు శ్రీ అగస్తేశ్వర స్వామి కోన వున్నాయి. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉండి మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఉరుసు ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఉరుసు ఉత్సవాల సమయంలో ఖవ్వాలి కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఇక్కడ దర్గాకు వెనుక భాగాన ఒక మసీదు కూడా వుంది. భక్తులకు గదుల సదుపాయం కూడా ఇక్కడ వుంది. ఇంకా ఇక్కడ మౌలాలి స్వామి దర్గాను కూడా దర్శించవచ్చు. చిన్న దుఖానాలు మాత్రమే ఇక్కడ అందుబాటలో వుంటాయి. ఇంకా ఇక్కడ పిల్లల వినోదం కోసం ఊయలలు నిర్మించారు. ఒకరోజు అనేది లేకుండా ఎల్లప్పుడూ ఇక్కడికి భక్తులు వస్తూ వుంటారు. అయితే విశేష రోజుల్లో ఎక్కువ మంది భక్తులు ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక్కడి స్వామి వారి చరిత్ర గురించి అక్కడి వారిని అడిగిచూసాము ఐతే వారికి కూడా ఖచ్చితంగా తెలీదు అన్నారు. ఇక్కడ వున్న మైలవరం జలాశయం యొక్క బ్యాక్ వాటర్ వున్న ప్రదేశంలో ఒకప్పుడు ఖాదరబాద్ అనే ఒక గ్రామం వుండేదట. జలాశయాన్ని నిర్మించే వుద్దేశ్యంలో ఆ ఊరిని ఖాళీ చేయించి వారికి వేరొక ప్రాంతంలో నివాసాలను కల్పించి ఇక్కడ జలాశయాన్ని నిర్మించారు అని అక్కడి వారిని అడిగి తెలుసుకున్నాం.

ఎలా వెళ్ళాలి ?

కొన్ని నిర్ణీత సమయాల్లో మైలవరంగైబుసా పహాడ్ మరియు గురప్ప స్వామి కోనకు జమ్మలమడుగు నుండి బస్సు సౌకర్యం కలదు అగస్తేశ్వర స్వామి కోనకు బస్సు సౌకర్యం వుందో లేదో సరిగ్గా తెలీదు. కానీ ప్రైవేట్ వాహనాలు మీకు అందుబాటులో వుంటాయి. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.

గమనిక : మా ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు !
   

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు